ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి తెదేపా కట్టుబడి ఉందన్నారు. గతంలోనూ కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంకు మద్దతు ఇచ్చినట్లు తెదేపా గుర్తు చేసింది. అలాగే తెలుగు బిడ్డ పి.వి.నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో ఆయనను తెలుగుదేశం బలపరిచిందన్నారు. తెలుగువారి కోసం, సామాజిక న్యాయం కోసం తెదేపా ముందు వరుసలో ఉంటుందన్నారు. ఇప్పటికే అధికార వైకాపా సైతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తెదేపా ఎప్పుడూ సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందని.. గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్‌లకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్రపతి ఎన్నికల బరిలో తొలిసారి బరిలో నిలిచిన ఆదివాసీ మహిళ ముర్మూకే తమ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
తెదేపాకు అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. రాజ్యసభలో ఒకరు, లోక్‌సభలో ముగ్గురు సభ్యుల బలం ఉంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ బరిలో నిలవగా.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.