భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపదీ ముర్ము. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఘనంగా జరిగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల సీఎంలు, పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముర్ము సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. ప్రమాణ స్వీకారానికి ముందు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లగా రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ముర్ముకు అభినందనలు తెలిపారు.
రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి ముర్ము నివాళి
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యంతో గెలుపొందిన ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళా రాష్ట్రపతిగా, తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపదికి గతంలో ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్ గవర్నర్‌గా సేవలు అందించిన అనుభవం ఉంది.
ఇది దేశ ప్రజల విజయం
వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపదీ ముర్ము తనను అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన ఎన్నిక కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక అన్నారు. రాష్ట్రపతిగా గెలుపొందడం తన ఒక్కరి ఘనత కాదని దేశ ప్రజలందరికీ దక్కిన విజయంగా ముర్ము అభివర్ణించారు. పేదలు కలలు కని నిజం చేసుకోవడం ఎలాగో తన ఎన్నికే నిదర్శనం అని పేర్కొన్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్ వేదికగా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు ముర్ము. దేశంలో సమ్మిళిత అభివృద్ధి కోసం, అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగిస్తానన్నారు.
”దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. భారత్ ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలు జరుపుకుంటోంది. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. 50 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి.. అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.”