గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు పదే పదే ప్రకృతి వినాశనకారులపై విరుచుకుపడే తీర్పులు ఇస్తున్నా వారి కట్టడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. రాష్ట్రంలో మాత్రం అక్రమ మైనింగ్ ఆగడం లేదు. కారణం దాని వెనక ఉండి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అక్రమార్కుల ధన దాహం తప్ప మరొకటి కాదు .. ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ పడితే అక్కడ కొండలు భూములు తవ్వటం వారికి అనుకూలంగా వాటిని వినియోగించటం పరిపాటిగా మారిపోయింది . లెక్కలేనన్ని తీర్పులు కోర్ట్ అక్షింతలను కూడా పక్కన పెట్టి అధికార పార్టీ పెద్దలు ఎం చేయాలనుకుంటే అడిగే వారు ఎవరు అన్న చందంగా వారి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ప్రకృతికి ఆలవాలంగా నివసించే పేదలకు తీవ్రనష్టం చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు భౌతిక దాడులతో తిరిగి వారికీ నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు ఈ వినాశకర పోకడలను ఎంత కాలం భరించాలనేదే ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రశ్న..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్ట్ 2010
పర్యావరణానికి హాని కలిగించే విషయాలపై చర్చ చేయటానికి చర్యలు తీసుకోవటానికి ఏర్పాటు చేసిన వ్యవస్థే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్ట్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి అద్వర్యంలో నడిచే ఈ ట్రిబ్యునల్స్ పర్యావరణం ప్రకృతి వినాశనకర విషయాలపై చర్చిస్తూ వాటి భద్రత కోసం అనేక తీర్పులు ఇస్తూ ఉంటుంది అనేక పెద్ద ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ముందు వీటి సూచనలను తప్పక పాటించాల్సి ఉంటుంది ఐతే వీటి నిబంధనలను చాలా వరకు పాటించకుండానే ప్రభుత్వాలు తమ అనధికార పనులు చేస్తూ ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ముందంజలో ఉంటుంది నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి కోర్ట్ చేతిలో చివాట్లు తింటున్నా వీరి వరుస మారదు..
సెంట్రల్ పొల్యూషన్ బోర్డు 1974
సెంట్రల్ పొల్యూషన్ బోర్డు అత్యుత్తమమైన వ్యవస్థల్లో ఒకటి వాతావరణంలో ఉన్న పొల్యూషన్ ని అరికట్టడం, ధ్వని కాలుష్యాన్ని నిర్మూలించటం, త్రాగునీటిలో హానికర వ్యర్దాలు లేకుండా చూసే ప్రక్రియలను నిర్వహిస్తూ ఉంటుంది . అంతేకాకుండా పట్టణ ప్రజల్లో నాచురల్ ఫ్రెండ్లీ పై అవగాహన పెంచటం లాంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. మున్సిపల్ వ్యర్దాలను హానికరం కాకుండా మార్చే ప్రక్రియను పరివేక్షిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక కేసులు ఈ బోర్డు దృష్టికి వచ్చిన నేపథ్యం వుంది. రాష్ట్రం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ విషయాలపై కూడా ఈ బోర్డు స్పందించిన చరిత్ర వుంది ఎన్ని ట్రిబ్యునల్స్ మరెన్ని బోర్డులు చెప్పినా ధనదాహం నెత్తికెక్కిన ప్రబుద్ధులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ చట్టాలకు తిలోదకాలు ఇస్తున్నారు రాష్ట్రం లో జరిగిన అక్రమ మైనింగ్ విషయాలపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అవుతున్న అవన్నీ పట్టించేకునే పరిస్థితుల్లో జగన్ రెడ్డి సర్కార్ లేదు.
విశాఖలో అక్రమ మైనింగ్ – పెద్దల కోసం కొండను తవ్వేస్తున్నారు
రిషి కొండ బీచ్ అందరికి పరిచయమున్న ప్రదేశం ప్రకృతి అందాలతో సుందరంగా ఉండే కొండ కనుచూపు మేరలో సముద్రం చుట్టూ పచ్చని హరిత తోరణాలతో ప్రకృతి ప్రేమికులను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. హరిత బీచ్ రిసార్ట్ పేరుతో అప్పటి ప్రభుత్వం 1984-88 మధ్య కాటేజీలు నిర్మించి ఏటా సుమారు 8కోట్ల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేసి ప్రయోజనాన్ని పొందారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువ శాతం ఈ కాటేజ్ లో నే బస చేసేవారు ఐతే 65 ఎకరాల్లో ఉన్న ఈ మొత్తం కొండను ఉన్నపళంగా చదును చేసి సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేస్తామని వైసీపీ ప్రభుత్వం తీర్మానించింది. అందుకు బిడ్ లను ఆహ్వానించింది ఐతే ఇది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ లో ఉన్న నేపథ్యం లో పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. పాత నిర్మాణాలు ఉన్న చోటే కొత్త కట్టడాలు నిర్మిస్తామని అనుమతులు తీసుకున్న ప్రభుత్వం వాస్తవం లో మాత్రం అందుకు విరుద్ధంగా కొండను తవ్వేసే పనిలో పడింది. దింతో గ్రీన్ ట్రిబ్యునల్ కు అనేక పిర్యాదులు అందాయి నిజానికి హరిత రిసార్ట్ ప్రాంతం సి ఏ ర్ జెడ్ పరిధిలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడని పరిస్థితి కానీ వాస్తవంలో మాత్రం దానికి వ్యతిరేకంగా జరుగుతుంది వందల కోట్ల రూపాయలు నిబంధనలకు వ్యతిరేకేయం గా ఈ హోటల్ నిర్మాణం కోసం కేటాయించటం జరిగింది.
దువ్వపాలెం లో కుప్పకూలిన కొండ – ప్రభుత్వ అండ
విశాఖపట్నం పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో పెద్ద కొండ అమాంతం కూలిన పరిస్థితి. గ్రావెల్ తవ్వకాల కోసం క్వారీ అనుమతులు పరిధి మేర ఉన్నా ధనదాహం కోసం క్వారీ తవ్వకాలను ఇస్తా రీతిన కొనసాగిస్తూ చివరికి పెద్ద కొండ కిందకు కూలిపోయే పరిస్థితి దాపురించింది. దింతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విచ్చలవిడిగా క్వారీ తవ్వుతూ అనుమతులు లేకపోయినా అధికారులతో కుమ్మక్కై గ్రావెల్ కోసం అధికార పార్టీ అండదండలతో దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
ఇలా రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితి ఎక్కడ కొండలున్న మైనింగ్ చేయటం ఇస్తా రీతిన ప్రవర్తించటం ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తుంది దీనికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం తో ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం ఫై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమం మైనింగ్ అరికట్టాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.