సినీనటుడు, పవన్ కల్యాణ్ ఓ దీక్ష చేపట్టారు. జన సంక్షేమమే ప్రధానంగా తాను ఈ దీక్షకు పూనినట్లు ప్రకటించారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు నెలల పాటు చేపట్టే ఈ దీక్ష అత్యంత కఠినంగానే ఉంటుంది. పవన్ కల్యాణ్ చతుర్మాస్య దీక్షను హైందవ సంప్రదాయం ప్రకారం తీసుకున్నారు. నాలుగు నెలలపాటు కఠిన నియమాలతో దీక్ష కొనసాగించాలి. ఆహార నియమాలతో పాటు ఆంక్షలు కూడా ఉంటాయి. వీటిని పవన్ తుచ తప్పకుండా పాటించాల్సిందే. లోక కల్యాణం కోసం తాను దీక్ష చేపట్టినట్లు పవన్ వెల్లడిస్తున్నారు. ప్రజల కోసమే దీక్షకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఒంటి పూట భోజనమే చేయాలి. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు కోసమే పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వీయుజం మాసాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది. దీనికి పవన్ కల్యాణ్ కంకణబద్ధుడై ఉండాలి. ఆదివారం ఆషాఢ మాసం ఏకాదశి కావడంతో దీక్ష ప్రారంభించారు. నాలుగు నెలల పాటు దీక్ష చేసి ప్రజల బాగోగుల గురించి పట్టించుకోనున్నారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. కొందరు దీన్ని 11 రోజుల పాటు మరికొందరు 31 రోజుల పాటు ఇంకొందరు నాలుగు నెలల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంల కనకదుర్గ అనుగ్రహం కోసం ఈ దీక్ష చేపడతారని తెలిసిందే. ఈ సమయంలో కనీసం పొలిమేర కూడా దాటకూడదు. అంతటి కఠిన నియమాలతో దీక్ష చేపడితేనే ప్రయోజనం కలుగుతుందని నమ్మకం.
అరుణోదయ వేళ స్నానం చేయాలి. ఒంటిపూట భోజనం చేయాలి. నేలపై నిద్రించాలి. అహింస పాటించాలి. ఏదైనా ఉపనిషత్తు పఠనం చేయాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు కంఠస్తం చేయాలి. ఇవన్నీ పవన్ కల్యాణ్ పాటించాలి. అప్పుడే చాతుర్మస దీక్ష ఫలప్రదం అవుతుంది. ఫలితం దక్కుతుంది. ప్రజల సంక్షేమం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వీయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులను త్యజించాలి. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం తీసుకోవచ్చు. ఇంతటి కఠిన నియమాలతో ఉపవాసం చేసి చతుర్మస దీక్షలను కొనసాగించాల్సి ఉంటుంది.
గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు .పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏకాదశి సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.కాగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.