ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలను వైయస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు.. రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైయస్ఆర్ సీపీ సభ్యులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న అనంతరం నూతన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్. నిరంజన్‌రెడ్డిలు సీఎం వైయస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఈ నలుగురి ఎన్నికతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎంపీలుగా ఎన్నికైన నలుగురు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం అసెంబ్లీ ఆవరణలోను, సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే..
వైయస్ఆర్ కుటుంబానికి సదా కృతజ్ఞుడునై ఉంటా – విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు, సలహాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం నిరంతరం శ్రమిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయాలు, పార్టీ విధి, విధానాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించేలా ప్రతి కార్యక్రమం ఉంటుందన్నారు. తమపై నమ్మకంతో రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని గుర్తుచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. లోక్ సభలో 21 మంది సభ్యులతో కలిపి, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా పోరాడతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమష్టిగా పనిచేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎజెండాను పార్లమెంటులో వినిపిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషిచేస్తామని చెప్పారు. వైయస్ రాజారెడ్డి దగ్గర నుంచి దివంగత మహానేత వైయస్ఆర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ వరకు, గత మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవలు అందిస్తున్న తనకు, రాష్ట్రానికి, ప్రజలకు సేవలందించే భాగ్యం కల్పించిన ఆ కుటుంబానికి సదా కృతజ్ఞుడునై ఉంటానని విజయసాయిరెడ్డి అన్నారు.
ప్రజాసేవ గొప్ప వరం-నిరంజన్ రెడ్డి
ప్రజాసేవలో నాకు అవకాశం కల్పించిన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి.. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక గొప్ప వరంగా భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాను. సీనియర్ నాయకుల సలహాలతో ముందుకెళ్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సాక్షిగా నిరంతరం శ్రమిస్తా అని హామి ఇచ్చారు.
గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు- ఆర్.కృష్ణయ్య
వెనుకబడిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి.. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పేద కులాల తరఫున పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశాన్ని, పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం వైయస్ జగన్‌కు ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో, ఎమ్మెల్సీల్లో ప్రతి సందర్భాల్లో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పిస్తూ రాజ్యాధికారం దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైయస్ జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా సీఎం వైయస్ జగన్‌కు రుణపడి ఉంటారన్నారు. చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ నిలిచారన్నారు. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలంతా పెద్ద చదువులు చదువుతున్నారని గుర్తుచేశారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా సీఎం వైయస్ జగన్ నిలబెడుతున్నారన్నారు.
బీసీల హృదయాల్లో సీఎం జగన్‌ది చెరగని ముద్ర-బీద మస్తాన్‌రావు
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా.. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలను కాపాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వైయస్ఆర్ సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అన్నారు. భారతదేశంలో అత్యున్నతమైన ఎగువ సభ రాజ్యసభకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు సభ్యులు ఎంపికైతే, వారిలో ఇద్దరు బీసీలను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు బీద మస్తాన్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం ఎంపీ బీద మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడారు.
వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా, ఆ వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి మాకు అవకాశం కల్పించిన సీఎం వైయస్ జగన్.. బీసీల హృదయాల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా వచ్చానని, రాజ్యసభ సభ్యత్వం వస్తుందని తాను ఊహించలేదన్నారు. తన చిన్ననాటి మిత్రుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రూ. 1.46 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలకు అందించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే సాధ్యమైందన్నారు. సంక్షేమ పథకాలకు లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే.. ఇదేదో నేరం అన్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, పేదవాడికి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే గర్వంగా చెప్పుకోవాలి గానీ, నిందలు వేయడం సరికాదన్నారు.