అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9న విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
జూన్ 4న శోభాయాత్ర, రాత్రి 7 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 5న పుణ్యాహవచనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తారు.
జూన్ 6న కుంభారాధన, ఉక్త హోమాలు, నవ కలశ స్నపన క్షీరాధివాసం, హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 7న పుణ్యాహవచనం, కుంభారాధన, చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, , యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 8న రత్నధాతు అధివాసం, కుంభారాధన, హోమాలు, విమాన కలశ స్థాపన, గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం, విగ్రహ స్థాపన, ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మహాశాంతి తిరుమంజనం, కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, విశేష హోమాలు, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 9న కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. ధ్వజారోహణం, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. సర్వదర్శనం కల్పిస్తారు.