అవినీతి పై ఫిర్యాదు చేసేందుకు ఈ అప్లికేషన్ 14400ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మొదటగా OTP నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిర్యాదుదారులు ఈ అప్లికేషన్ ద్వారా రెండు విధాలుగా ఫిర్యాదు చేయవచ్చు. మొదటిది లైవ్ స్ట్రీమింగ్, రెండోవాది ఆడియో, వీడియోను రికార్డు చేసి పంపే సౌకర్యాన్ని కల్పించింది. గతంలో జరిగిన ఆవితిపైన సైతం ఫిర్యాదు చేసే విధంగా ఈ అప్లికేషన్ ను రూపొందించడం జరిగింది. ఈ రెండు విధానాల ద్వారా అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, పనిచేస్తున్న శాఖతో కూడిన పూర్తి వివరాలను పంపిస్తే దీనిపైన తక్షణమే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
Andhra Pradesh Police @APPOLICE100
The Andhra Pradesh Police has launched the new application 14400 for complaints aimed at eradicating #Corruption
అవినీతి నిర్ములనే ధ్యేయంగా ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిఏపీ ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఫిర్యాదుల కోసం నూతన అప్లికేషన్ 14400 ను అందుబాటులోకి తీసుకొచ్చింది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ట్వీట్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ ఈ యాప్ ని తయారుచేసింది. ఈ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నాం. ఎక్కడా అవినీతి ఉండకూడదు అని చెబుతున్నాం. దీనికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.41లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలాంటి అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలిపారు.