భారతదేశ ప్రజలైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేముగా ఇచ్చుకుంటున్నాము. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దుకున్నాం అని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఘనంగా చాటుకున్నాం అంటే దీని అర్ధం భారత ప్రజలు మాత్రమే భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు తప్ప మరే ఇతర వ్యవస్థ ఆ ప్రత్యేకమైన విషయంలో జోక్యం చేసుకోలేదు అని దాని అర్ధం అంటే ప్రజలే ప్రభువులు, ప్రజాపాలనకు ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు అని రాజ్యాంగ పరిషత్ ధృవీకరించింది. ప్రజాస్వామ్య రాజ్యం అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయించినపుడు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఫోర్స్ లోకి వస్తాయి. ఆర్టికల్ 12-35 ప్రాథమిక హక్కుల స్థాపన గురించి చర్చిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అన్న నిర్వచనంతో మొదలయ్యి అనేక స్వేచ్చాగమన విషయాలు ఇందులో ప్రస్తావనకు వస్తాయి. అందరికీ సమానంగా జీవించే హక్కు అంటరానితనం నిషేధం ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్ష లేకుండటం స్వేచ్ఛగా మత హక్కు, అలాగే విద్యా విషయపు హక్కు ఇలా ప్రజలకి బానిసత్వం నుండి అధికార నియంతృత్వం నుండి ఎంత మేరకు స్వేచ్ఛనివ్వాలో భారత రాజ్యాంగం అంత మేర తన పరిధిని విస్తృత పరిచింది దీనితో సామాన్య ప్రజానీకానికి పరిధి మేర హక్కులు బాధ్యతలు కల్పించబడ్డాయి. ఈ హక్కులు అమలుచేసుకునే క్రమంలో లోపాలు ఉన్న లేదా భాద్యతలు విస్మరించి చట్టాన్ని అతిక్రమించిన చట్టం ఫోర్స్ లోనికి వచ్చి దండనీయ నియమావళిలోనికి మనిషి చేర్చబడతాడు.
దండనీయత – ప్రజాప్రతినిధులు
భారత శిక్షా స్మృతి దండనీయ అధికారం గురించి చెబుతుంది. ఎటువంటి తప్పులకు ఎటువంటి శిక్షలు అమలుచేయాలో వివరిస్తుంది. నేరస్తుడిని ఎలా విచారించాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వివరిస్తోంది ప్రజా ప్రతినిధుల విషయానికొస్తే వారికీ ప్రత్యేకం గా అత్యద్భుతమైన చట్టాలు ప్రత్యేక నియమావళి సాధారణ పౌరుల నుండి వారిని వేరు చేసే ప్రత్యేక కోడ్ అంటూ ఏమి ఉండదు ఐతే వారు ప్రజా ప్రతినిధులగా ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చూపించే క్రమంలో సంబంధిత శాసన సభకు లేదా పార్లమెంట్ కు విన్నవించాల్సి వస్తోంది. ఏ పరిస్థితుల్లో వారిపై అరెస్ట్ చూపించామో తెలపాల్సిన అవసరం ఉంది అంతే తప్ప వారికీ ప్రత్యేకమైన లేదా దైవాంశ సంభూతుల్లా చూసే విధానం ఏది భారత రాజ్యాంగం లో లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల దురుసుతనం -రాజ్యాంగ విరుద్ధం
ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న తరువాత ప్రజా ప్రతినిధులుగా నియమిపబడి కొన్ని ప్రత్యేక హక్కులను ప్రజలకోసం ప్రజల నిధులతో వాడుకుంటూ ఎవరి ద్వారా వారికీ అధికారం వచ్చిందో వారిపై తిరిగి అసంబద్దగా భౌతిక దాడులకు దిగటం మా అవసరాలు తీర్చండి అంటే వారిని వేధించటం అధికారంతో ఏమైనా చేయగలం అనే భావనని ప్రజలఫై రుద్దటం ఆంద్రప్రదేశ్లో పరిపాటిగా మారిపోయింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇరిగేషన్ ఏ ఈ సూర్యకిరణ్ ని చెంపదెబ్బ కొట్టడం గతంలో నర్సీపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ శానిటైజర్స్ లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అతని పైదాడికి దిగి కేసులు పెట్టి చివరికి అతను మరణించే వరకు వేధించటం అదేవిదంగా గుడివాడలో కొడాలి నాని సమక్షంలోనే కొంతమంది అక్కడి తహసీల్దార్ పై దాడికి దిగటం నెల్లూరులో ఎంపీడీఓ సరళ ఇంటిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటిపై దాడి చేయటం అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పై ఆగ్రహం శ్రీకాకుళం విఆర్ ఓ సుశీలపై దాడి గుంటూరు జిల్లాలో తహసీల్దారు వెంకటేశ్వర్లు పై దాడి చిత్తూరు లో సచివాలయ ఉద్యోగుల పై దాడి పంచాయితీరాజ్ విభాగంలో వైసీపీ నాయకులూ ఆవేశ పూరిత మాటలు ఇలా చెప్పుకుంటూ పొతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ప్రభుత్వ ఉద్యోగుల పరిసితి చాల దారుణం ఉంది ప్రజా ప్రతినిధుల దయ దాక్షణ్యాల మీద వారు నడుచుకోవాల్సిన పరిస్థితి.
ప్రభుత్వ అధికారులు – వారి హక్కులు
ప్రభుత్వ అధికారులు కోసం స్టేట్ సీసీ రూల్స్ ప్రత్యేకం గా వారి విధులు బాధ్యతలు అపాయం ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చర్యలని కోడ్ చేసింది ఎవరైనా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తే వారి పై తక్షణం కేసు బుక్ చేసే విధంగా ఉండాలని సంబంధిత నేరస్తుడి పై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి తెలియచేసే పద్దతిని అందులో వివరించింది ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక హక్కులు కానీ భౌతిక దాడులకు దిగే స్వేచ్ఛ గాని ప్రజాస్వామ్యంలో లేనే లేదు రాచరిక పాలన నుండి సర్వ సత్తాక ప్రజాస్వామ్య సమాజం లో ఉన్న మనం పరస్పరం గౌరవ మర్యాదలతో ఉండాలి కానీ నియంతృత్వ పోకడలు తావివ్వకూడదు ఆలా ఎవరు ప్రవర్తించినా చట్టం ఫోర్స్ లోనికి వచ్చి తన పని తాను చేసుకుంటుంది.కాబట్టి ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లో ప్రభుత్వ అధికారులపై సాగుతున్న దమనకాండను యావత్తు ప్రజలు ముక్త కంఠం తో ఖండించాల్సిన అవసరం ఉంది.