రైతుల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నామంటున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
రైతుల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నామంటున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ..కేంద్రప్రభుత్వ పధకాలను తమ సొంత పధకాలుగా చెప్పుకుంటోందని విమర్శిస్తూ….భారతీయ జనతా పార్టీ నాయకులు లంకా దినకరన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కౌలు రైతులకు ఎక్స్‌గ్రేషియా అని చెప్పిన మాటలు జీవో లకే పరిమితమయ్యాయని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా అని పెద్ద అక్షరాలలో రాసి, సబ్ టైటిల్‌గా చిన్న అక్షరాలతో పీఎం కిసాన్ అని ఎందుకు రాశారని… దీంట్లో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకి 12 వేల 500 రూపాలయను ఇస్తామని చెప్పి, ఇప్పుడు 7 వేల 500 రూపాయలకు ఎందుకు కుదిరించారని ఆయన ప్రశ్నించారు.
ఇది ఇలా ఉంటే…….ఏ పధకం ప్రారంభించినా కూడా సీబీఐ దత్త పుత్రుడు జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని మాత్రం తల్చుకోకుండా మాత్రం వుండరని…ఆయనంటే ఎందుకంత భయమంటూ జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తూ…. ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులను కలుపుకొంటే ప్రతి రైతుకు 19 వేల 500 రూపాయలు రావాలని….. కానీ ఇస్తున్నది కేవలం 13 వేల 500 రూపాయలు మాత్రమేనని ఆయన వివరించారు… అంటే ఒక్కో రైతుపై 6వేల రూపాయలను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మిగుల్చుకుంటూ..రైతులను నిలువునా మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
దీనికి ఏం సమాధానం చెబుతారు? అంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తాను రైతు బిడ్డనని చెప్పుకొంటున్నారని ..ఇది సిగ్గుచేటని విమర్శించారు. ఆయన చంచల్‌గూడ ముద్దు బిడ్డ అని..ఆ విషయం అందరికీ తెలుసు అని అన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ దత్తపుత్రుడు చేసిన ప్రసంగం లో ప్రజల సంక్షేమం కన్నా కూడా ప్రతిపక్షాలను విమర్శంచడానికే ఎక్కువ సమయం కేటాయించారని తెలిపారు.
పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారు అనడం ముఖ్యమంత్రి అవగాహనా రాహిత్యాన్ని వెల్లడిస్తోందని మండిపడ్డారు.అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కొంచెం కూడా అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి వున్నారంటే..భవిష్యత్ లో రాష్ట్ర పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కలుగుతోందని అన్నారు.