చంద్రబాబు, లోకేష్ ఎందుకు హైదరాబాద్ వదిలి విజయవాడకు రావటం లేదు? ఏపీలో ఎన్నిరోజులు తిరిగినా.. మళ్లీ హైదరాబాద్ కే వెళ్లటం ఎందుకు? ఈ ప్రశ్నలు వైసీపీ నేతలు ఎప్పటి నుంచో వేస్తున్నారు. అయినా బాబు, లోకేష్ పట్టించుకోవటం లేదు. కాని ఇప్పుడు ఆ ప్రశ్నలు టీడీపీ శ్రేణులపై ఎఫెక్ట్ చూపించాయి. వారు కూడా ఎందుకు హైదరాబాద్ అనే ప్రశ్న వేస్తున్నారు. పైకి అధినేతలను ప్రశ్నించలేకపోయినా.. కింది స్థాయిలో మాత్రం చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఉండవల్లిలో ఒక ఇల్లు తీసుకున్నారు. అది లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్. అందులోనే అందరూ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పక్కనే ప్రజావేదిక ఏర్పాటు చేసుకుని.. అక్కడి నుంచే క్యాంప్ ఆఫీస్ రన్ చేశారు. అయితే ఆయన ఓడిపోయాక.. వైసీపీ ప్రభుత్వం కరకట్టపై అక్రమ కట్టడాలు కూడదంటూ ముందు ప్రజావేదికను కూల్చేశారు. రూల్స్ ప్రకారం చంద్రబాబు ఉండే లింగమనేని గెస్ట్ హౌస్ కూడా పడేయాలి. తర్వాత వారంతా కోర్టుకు వెళ్లారు.. స్టే ఆర్డర్లు తెచ్చారు. తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలియదు.
అప్పటికే హైదరాబాద్ లో మంచి ఇల్లు కట్టించారు చంద్రబాబు. ఆ ఇంట్లోనే ఉండటం మొదలెట్టారు. అక్కడి నుంచే ఏపీకి రావడం పోవడం చేస్తున్నారు. దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. ఉండవల్లిలో ఆ గెస్ట్ హౌస్ వదిలేసి.. విజయవాడలోనో.. లేక మంగళగిరిలోనో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు కదా.. ఆర్ధిక సమస్య ఎటూ లేదు. అయినా ఎందుకు ఏర్పాటు చేసుకోవడం లేదు? దీనికి కొంతమంది చెప్పేది.. ఇక్కడే ఉండటం.. జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేయొచ్చు అని వాదిస్తున్నారు. అయితే మరి హైదరాబాద్ లో ఉన్నా కూడా అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. కోర్టు ఆర్డర్ ఉండబట్టి ఆగారు.. లేకపోతే విచారణకు పిలిచి అరెస్ట్ చేసేవారే. కాబట్టి కేసులు, అరెస్టులు ఎక్కడ ఉన్నా తప్పదు.మంగళగిరిలోనో, విజయవాడలోనో ఉంటే.. పార్టీ కార్యకర్తలు కలవడానికి గాని, రెగ్యులర్ గా మీటింగులు పెట్టి చర్చించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని టీడీపీలోనే వినపడుతుంది. ఇప్పటికైనా.. చంద్రబాబు, లోకేష్ లు తమ మకాం హైదరాబాద్ నుంచి మారిస్తే.. వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లు ఉంటుందని.. పార్టీకీ ఉపయోగకరంగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి నారావారి కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.