టీడీపీ అధినేత చంద్రబాబు మీద పగ తీర్చుకోవాలని అనినెప్పటి నుండో ఎదురు చూస్తున్న లక్ష్మి పార్వతి ఆశల మీద సుప్రీం కోర్టు నీళ్ళు చల్లింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలనే పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించాకే ఆ పిటిషన్ కొట్టివేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.లక్ష్మి పార్వతి వైఎస్సార్సీపీ లో జాయిన్ అయ్యి ఎలాగైనా చంద్రబాబును దెబ్బ తీయాలని అని చాలా కాలం గా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా అనేక మార్లు నందమూరి, నారా వారి కుటుంబాలకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అది కుదరక పోవడం తో కోర్టుల ద్వారా అయినా చంద్రబాబు ను దెబ్బ కొట్టాలని చాలా సార్లు చూశారు. ఇప్పుడు కూడా లక్ష్మి పార్వతి పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయడం తో లక్ష్మి పార్వతి కు చంద్రబాబు మీద పై చేయి సాధించడం అసాధ్యం అని తేలిపోయింది