మనకు సంబంధించిన వ్యక్తి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికీ ఎలాంటి సమస్య ఎదురైనా వెంట నిలబడతాం. కానీ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం జేసీ బ్రదర్స్ కిమ్మనకుండా ఉండిపోయారు. గోరంట్ల మాధవ్..న్యూడ్ వీడియోతో ఫుల్ గా వైరల్ అవుతున్న పేరు. గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రస్థానం జేసీ బ్రదర్స్ వల్లనే స్టార్ట్ అయ్యింది. ఐతే మాధవ్ ఇంతలా ట్రోల్ అవుతున్నా కూడా జేసీ బ్రదర్స్ మాత్రం ఎందుకు ఏమీ మాట్లాడ్డం లేదో అర్థంకావడం లేదు. ఈ వీడియో ఒరిజినల్ కాదంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిందని పోలీసులు చెప్తుంటే టీడీపీ మాత్రం మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ వీడియో మీద రోజూ టీవీల్లో డిబేట్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మాధవ్ వెంట ఉండాల్సిన జేసీ బ్రదర్స్ ఎక్కడ కనిపించడం లేదు. గతంలో జరిగిన ఇష్యూ గుర్తు చేసుకుని నాకెందుకులే అనుకున్నారా ? లేదంటే ఇప్పుడు ఎం మాట్లాడితే ఏ సమస్య వస్తుందో అని భయపడ్డారా ? లేదంటే తన మీద నోరు పారేసుకున్నందుకు మాధవ్ కి ఎం జరగాలో అదే జరిగిందిలే అని చాటుగా చంకలు గుద్దుకుంటున్నారా ? లేదా పార్టీ మారే యోచనలో భాగంగా రచిస్తున్న కొత్త వ్యూహమా ? అనే విషయం అర్థంకావడం లేదు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి ఒక సభలో పోలీసుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కదిరి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం మెలేసి నాలుక తెగ్గోస్తా అంటూ జేసీకి కౌంటర్ వార్నింగ్ మీడియా ముఖంగా ఇచ్చారు.
ఆ వెంటనే వైసీపీ మాధవ్ కి హిందూపురం ఎంపీ సీటు ఇచ్చేసింది. మాధవ్ విషయంలో అనంతపురం టీడీపీ నేతలంతా స్పందించారు కానీ జేసీ మాత్రం బయటికే రాలేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఏదీ కలిసి రావడం లేదని ఈ బ్రదర్స్ బహిరంగంగానే చెప్పారు. ఇక ఇప్పుడు టీడీపీ మాధవ్ వీడియో విషయంలో చర్యలు తీసుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నా జేసీ బ్రదర్స్ మాత్రం చంద్రబాబు మీద కోపంతో సైలెంట్ గా ఉన్నారంటున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే ఇటీవల జేసీ ఇంటిపై ఈడీ దాడులు చేసినప్పుడు టీడీపీ అసలు పట్టించుకోలేదు ఏ విధంగానూ స్పందించలేదు కాబట్టే ఇప్పుడు వాళ్ళేమి కలగజేసుకోవడం లేదనేది తాడిపత్రి టీడీపీ వర్గాల మాట. జేసీ బ్రదర్స్ అక్రమాల చిట్టా అంతా ఇంతా కాదు. ఇంకా టీడీపీలో కొనసాగితే కష్టమని భావిస్తున్న ఈ బ్రదర్స్ ఈడీ కేసుల నుంచి బయట పడేందుకు బీజేపీలోకి వెళ్ళడానికి చూస్తున్నట్టు కనిపిస్తోంది.