జగన్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. వారంలో CPS రద్దు అన్నారు, ఇప్పుడు రద్దు చేయకపోగా ఉద్ద్యోగులను నానా హింసలు పెడుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేదం అన్నారు, ఇప్పుడు మద్యం ఆదాయం పెంచుకోవడమే కాదు, ఆ ఆదాయం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేక పోతున్నారు. అంతేకాదు భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటన చేస్తూ పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు, వ్యవస్థలకు జరిమానా, జైలు శిక్ష విధిస్తాం. తెలుగు మీడియంను ఎత్తేసిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగును వాడకకపోతే జైలు శిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శిక్షించే అధికారం ఉంది.
పక్క రాష్ట్రాలు మాతృభాషను ప్రాణంగా చూస్తూంటారు. మాతృభాషలోనే ప్రాథమిక చదువు ఉండేలా చూసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం అసలు మాతృభాషను పూర్తిగా చంపేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో చదువు తెలుగులో నేర్పకుండా ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని,బోర్డులు తెలుగులో పెట్టాలని ఆర్డర్లు ఇస్తున్నారు. తాము తెలుగును కాపాడుతున్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులు నిబంధనలు గతంలోనే ఉన్నాయి.
షాప్ ల మీద తెలుగులో పేర్లు రాయకపోయినా జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అసలు తెలుగు భాషను నేర్చుకోకుండా చేసి తెలుగు మీడియం రద్దు చేసి, తెలుగులో ఉత్తర్వులు ఇవ్వకపోతే జరినిమా వేస్తాం, బోర్డులు తెలుగులో రాయకపోతే జైలుకు పంపిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ ఉత్త్పన్నమవుతుంది. మాతృభాషలో విద్యను నేర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని.. జాతీయ విద్యా విధానం కూడా స్పష్టంచేసింది. కానీ తెలుగు మీడియంను రద్దు చేయడం కోసం ఏకంగా సీబీఎస్‌ఈ విధానాన్నే అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది.