బింబిసార పీరియాడికల్ మూవీ. కళ్యాణ్ రామ్ హీరోగా ఈ మూవీలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అంటూ సంబంధం లేకుండా మంచి మూవీ అనుకుంటే దాన్ని ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మూవీ లో క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. కీరవాణి, చిరంతన్ భట్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి… అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి “విజయహో” అనే పాటను విడుదల చేశారు. లేటెస్ట్ గా సెన్సార్ టీమ్ U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు.‘బింబిసార’ సినిమా చూసి సెన్సార్ వాళ్లు సినిమాను బాగా రిచ్‌గా గ్రాండ్ గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ ఎంజాయ్ మెంట్ అందించబోతోంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ మూవీ ప్రత్యేకంగా నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ తో పారు లిరికాల్ సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ గురించి మాట్లాడిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
తాజాగా విడుదల చేసిన కొత్త ట్రైలర్లో “హద్దులను చెరిపేస్తూ రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష..ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి” అనే డైలాగ్ మంచి ఫేమస్ అయ్యింది. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్స్ కోసం చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. బింబిసారుడిగా కాళ్యాణ్ రామ్ గెటప్ పై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ హిట్ అందుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే కొంత టైం వేచి చూడక తప్పదు.
The most courageous and ruthless king is called, #Bimbisara ⚔️#Vijayaho Song out now ❤️🔥
🔗 https://t.co/xwMvz9SIUk#BimbisaraInCinemasFromTomorrow@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/eCyGtjXczt— NTR Arts (@NTRArtsOfficial) August 4, 2022