జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, 2019 ఎన్నికల మేనిఫెస్టో లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానం అధికారంలో వచ్చిన వారం రోజుల్లో CPS రద్దు చేస్తా, ఈ మాట నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కు అండగా నిలబడ్డారు.పాత పెన్షన్ విధానాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్న ఆశ కు పోయిన ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు జలక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్ తో ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులను ఆపేందుకు పోలీసులు అందివచ్చిన ప్రయత్నాలన్ని చేస్తున్నారు. చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడిలో పాల్గొనకుండా సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులిస్తూ,MRO ల ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు పిలిస్తే కిరాయికి వెళ్లవద్దంటూ ప్రైవేటు వాహనదారులకు సూచిస్తున్నారు. విజయవాడ హోటళ్లలోనూ ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 1న సీఎం జగన్ ఇంటి ముట్టడి,విజయవాడలో భారీ బహిరంగ సభకు సీపీఎస్ సంఘాల పిలుపునిచ్చారు. ఉద్యోగులపై పోలీసులు ఎక్కడికి అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు పోలీసులు నోటీసీలు జారీ చేస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న పోలీసులు అక్కడే ఉద్యోగులకు చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అనుమతి లేకుండా హాజరుకావటం నేరపూరితమని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. విజయవాడలో ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో గాంధీ నగర్ లో పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా నగరానికి వచ్చి లాడ్జిలలో బస చేస్తే చెప్పాలంటూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఉద్యోగులు తలపెట్టిన నిరసనకు అనుమతి లేదన్నారు.






