రిటైర్డ్ ఐఏఎస్ మాజీ సీఎస్ కృష్ణారావు మరో సారి టీడీపీ మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కి టీడీపీ కి మధ్య పొత్తు అసంభవం అన్న చందనా ఆయన తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ఈ మాజీ సీఎస్ మొదటి నుండి టీడీపీకి వ్యతిరేఖంగా మాట్లాడుతారు అన్న పేరు ఉంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక నిర్ణయాలను ఆయన బాహాటంగానే విమర్శించేవారు. ఇప్పుడు కూడా ఆ పంథా నే కొనసాగిస్తున్నారు.
You have worded it wrong.Does TDP want to revive the alliance with BJP ? There is no question mark there . It does want and given enough of indications to that . You should have posed it as does BJP want to have an alliance with TDP? That is the crux of the issue. https://t.co/CAXwXwq0Pw
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 1, 2022
రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఒక చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇవాళా నిన్నా పుట్టిన పార్టీ కాదు అలాంటి పార్టీ తెలంగాణాలో చచ్చిపోయింది అని అంటున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు అయిన ఐవైఆర్ క్రిష్ణారావు. ఆయన రాజకీయ విశ్లేషణ ప్రకారం మరీ చచ్చిపోయిన పార్టీ అనడం ఒక విధంగా టీడీపీ మీద అక్కసుతో కామెంట్ చేసినట్లే అంటున్నారు.తెలుగు రాష్ట్రాలలో బీజేపీతో టీడీపీ పొత్తు అన్నది జరిగే పని కాదని, దాని మీద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసేవారు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆయన వ్యంగ్యంగా అనేశారు. నిజానికి ఈ పొత్తుల కోసం తెర వెనక వన్ సైడెడ్ గానే లాబీయింగ్ జరుగుతోందని కూడా ఆయన అంటున్నారు. పొత్తు అజెండా తో లాబీయింగ్ చేసేవారు ఆయాసపడవద్దు అని ఐవైఆర్ క్రిష్ణారావు చేసిన లేటెస్ట్ గా ట్వీట్ చేశారు.
The lobby pushing this agenda can take rest .@JaiTDP is dead in Telangana and any alliance with them for Telangana can be a liability for @BJP4Telangana rather than being of help. BJP can fight it's battles on its own in Telangana and does not need broken crutches . https://t.co/Xr4lx1fSaw
— IYRKRao , Retd IAS (@IYRKRao) August 31, 2022






