ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూసుకుంటే తెలుగుదేశం కి ఒక ప్రత్యేక అధ్యాయం తప్పకుండా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది లో తెలుగుదేశం పాత్ర గణనీయమైనది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావమే ఒక విప్లవం అని చెప్పక తప్పదు. సినీ ప్రపంచ రారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేయడం. తెలుగుదేశం పార్టీ కి సినీ గ్లామర్ కూడా మొదటి నుండి తోడుగా వుంటూ వచ్చింది. ఆ సినీ గ్లామర్ కి పొలిటికల్ గ్లామర్ అద్దిన ఘనత మాత్రం కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది.
అదే సినీ గ్లామర్ టీడీపీకి కొన్ని సార్లు బలహీనత కూడా అవుతోంది. టీడీపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. 2014 నాటి పొత్తులను కొనసాగించాలనుకుంటోంది. అయితే జనసేన పార్టీ మునుపటిలా కాదు, ఆ పార్టీ నుంచి గట్టిగానే డిమాండ్స్ వస్తున్నాయి. టీడీపీతో పొత్తు అంటే సీఎం సీటు షేరింగ్ కూడా డిమాండ్ చేస్తున్నారు.దాంతో ఆలోచనలో పడిన తెలుగుదేశం చాలా కాలంగా సైలెంట్ గా ఉంది.ఈ మధ్యన మన చేనేత మన గర్వం అంటూ పవన్ నుంచి వచ్చిన చాలెంజికి కూడా చంద్రబాబు రియాక్ట్ కాలేదు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు వైసీపీ లాగానే టీడీపీ కూడా అన్నారు. రెండు పార్టీలతో సమాన దూరం పాటిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా టీడీపీ శిబిరంలో ఎలాంటి కలవరం లేదు.టీడీపీ ఈ విషయం మీద ముందుగానే కసరత్తు చేసి ఉండాలని అనుకుంటున్నారు.
ఇక జూనియర్ ఎన్టీయార్ విషయం తీసుకుంటే ఆయన టీడీపీకి దగ్గరా దూరామా అంటే ఎవరూ చెప్పలేరు. అలాంటి జూనియర్ ని బీజేపీకి కేంద్రంలో కీలకమైన హోం మంత్రిగా ఉన్న అమిత్ షా డిన్నర్ కి పిలిచి మరీ టీడీపీ శిబిరాన్ని కెలికారు. అలాగే జూనియర్ లో ఎక్కడో దాగి ఉన్న రాజకీయ ఆకాంక్షలను కూడా తట్టిలేపాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేసింది.నిజంగా ఇది టీడీపీకి కంగారు పుట్టించాల్సిన సందర్భమే.జూనియర్ కనుక చురుకు పుట్టి రాజకీయంగా సందడి చేస్తే టీడీపీకి అది ఎంతో కొంత ఇబ్బందే.కానీ టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటించింది. పెద్ద ప్రాధాన్యత అంశం లా భావించలేదు.
ఈ ఇద్దరు స్టార్స్ విశేష జనాకర్షణ కలిగిన స్టార్స్,వీరు గతంలో టీడీపీ కి రాజకీయంగా సహాయం చేసిన వ్యక్తులు కూడాను.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం సినీ గ్లామర్ కంటే రాజకీయ గ్లామర్ నీ నమ్మికుంది కాబట్టి ఈ సందర్భాల్లో మౌనం వహించింది అని ప్రజలు అనుకుంటున్నారు.






