జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేస్తూ అనేక వాగ్దానాలు చేస్తూ మధ్యపాన నిషేదం గురించి మాట్లాడుతూ “2019 ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం,మూడు దశల్లో అమలు చేస్తాం.మొదటి దశలో బానిసలైన మందుబాబులు మద్యం తాగడం మానేలా ప్రతి నియోజకవర్గంలోనూ డి-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.రెండోదశలో మందుబాబులకు అందుబాటులో లేని స్ధాయిలో మద్యం ధరలను భారీగా పెంచుతాం.మూడో దశలో సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తా,రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తా” అని జగన్ నమ్మబలికారు.
ఈ రోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- మద్య విమోచన ప్రచార కమిటీ నేతృత్వంలో మత్తు పానీయాలపై అవగాహన సదస్సు, కళాజాత నిర్వహిస్తున్నాయి.మద్యం తదితర మత్తు పానీయాలను సేవించకూడదని, వాటి దుష్ప్రరిణామాలపై పలువురు వక్తలు చైతన్యపరుస్తారట. మత్తు పానీయాలను విక్రయించేది ప్రభుత్వమే. మళ్లీ వాటిని తీసుకోకూడదని అవగాహన కల్పించేది అదే.ఇదెక్కడి విడ్డూరమని మహిళా సంఘాలు, పౌర సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ప్రస్తుతం మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వం నడవలేని దయనీయ స్థితి. అవగాహన సదస్సుల పేరుతో ఎవరిని మోసం చేయడానికి ప్రభుత్వం, దాని అనుబంధ మద్య విమోచన ప్రచార కమిటీ చేస్తున్నాయని జనం ప్రశ్నిస్తున్నారు.నిన్న కర్నూలు జిల్లా కోడుమూరులో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను కొట్టి పిల్లలను తీసుకెళ్లి అర్ధరాత్రి వెళ్లి నిర్జన ప్రదేశంలో వదిలేయడం తీవ్ర కలకలం రేపింది.
రాష్ట్రంలో ఇంకా అనేక మానభంగాలు, దొంగతనాలు అమానవీయ సంఘటనలకు కారణం ఈ మద్యం. ఈ పాపాలనన్నిటికి మధ్యమే కారణం, దానిని అమ్ముతున్న ప్రభుత్వానికి ఈ పాపంలో భాగం లేదా?…కానీ ఏమీ ఎరగనట్టు మళ్ళీ అవగాహన సదస్సు, “సీఎం గారు మీరెలాగో మధ్యపాన నిషేదం చేయలేరు కనీసం జనాల్ని మభ్యపెట్టే ఇలాంటి కార్యక్రమాలు జోలికి వెళ్లకుండా ఆ ధనాన్ని వృదా చేయకండి” అని ప్రజలు అనుకుంటున్నారు.