ఏపీ లో నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓ వైపు అమరావతి రైతుల మహా పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో పెట్టాలనుకుంటోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అసెంబ్లీలో ఏం జరగుతుంది అన్న ఆసక్తి ప్రజల్లో బలపడింది. మూడు రాజధానుల బిల్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటికే రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు స్పష్టంగా తీర్పునివ్వడమే కాకుండా ఎలాంటి చట్టాలు చేసే చాన్స్ లేదని రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. ఇప్పుడు మూడు రాజధానులను ఏ రూపంలో అయినా చేపట్టి బిల్లు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు దారి తీయవచ్చన్న వాదన వినపడుతుంది.
ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా ఉందని కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మూడు రాజధానుల బిల్లు అంశంపై ప్రభుత్వం ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వకపోయినా సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారని టాక్ వినపడుతుంది.అసెంబ్లీ సమావేశాల తొలి రోజే మూడు రాజధానుల అంశంపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. మూడు రాజధానులు చేస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
హైకోర్టు తీర్పు ఉల్లంఘించి CRDA ను ఇతర చట్టాలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల వివాదం అవుతుంది కానీ రాజధాని ఏర్పాటు కాదన్న అభిప్రాయం నిపుణుల్లో ఉంది. చట్ట పరంగా అందరి ఆమోదంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్లనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇలా చేయాలంటే రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మూడు రాజధానులు చేయాలనే పట్టుదలతో ఉంది .అయితే రైతులు న్యాయపోరాటం ద్వారా.. చాలా వరకూ న్యాయం తమ వైపే ఉందని నిరూపించుకున్నారు






