భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, వివిధ కేటగరీలలో ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా, కొన్ని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా, ఇంకొన్ని అభివృద్ధి నోచుకోని రాష్ట్రాలుగా మిగిలిపోతాయి.
భారత రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తిని నెలకొల్పింది. దానిలో భాగం గా కేంద్రం, రాష్ట్రాలకు వివిధ సంస్థలను కేటాయించడం జరుగుతుంది, కేంద్రం అందించిన అవకాశాలు అందుకొని ముందుకు సాగుతున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న రాష్ట్రాలుగా,కేంద్రం అందించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోక మిగిలిన రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాలుగా మిగిలిపోతాయి.
భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తరువాత వివిధ కారణాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని రాజధాని హైదరాబాద్ లో ఉండేవి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు వాటిలో పని కోసమో, చదువు నిమిత్తమై హైదరాబాద్ కి వెళ్ళేవారు, కానీ 2014 లో రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ కు వెళ్లిపోవడం తో, మన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సంస్థలు లేకుండా పోయాయి, అలాగే విభజన చట్టంలో కొన్ని సంస్థలను కేటాయించడం జరిగింది.
దానిలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) ను 2014 లో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో పాటు హర్యానా, అస్సాం, మధ్యప్రదేశ్ కు కూడా కేటాయించడం జరిగింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో 50 ఎకరాల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టింది. మరియు 40 నుండి 50 శాతం పనులు కూడా పూర్తి అయ్యాయి, 2019 లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నిర్మాణాల మీద పూర్తి గా నిర్లక్ష్యం వహించింది. దానితో 2015 లో అధికారికంగా ప్రారంభం అయిన తరగతులు తాత్కాలికంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో నిర్వహిస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అస్సాం, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు క్యాంపస్ లను పూర్తి చేసి తరగతులను ప్రారంభించాయి.కానీ ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం వల్ల విద్యార్థులు ఇంకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోనే చదువుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన సంస్థల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్ద్యోగాలు ఏర్పడుతాయి, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది, అంతేకాకుండా మన విద్యార్థులు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో చదువు పూర్తి చేసుకుంటే జాతీయ స్థాయిలో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది, కానీ జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడ వేసిన గొంగడి లా ఆ నిర్మాణం ముందుకు కదలడం లేదు, కేంద్రం కేటాయించిన సంస్థలను ముఖ్యంగా విద్యా సంస్థలపైన జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలి అని మేధావులు, విద్యావంతులు కోరుకుంటున్నారు.