జాతీయ నేర నమోదు సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ఇటీవల దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 2021కి సంబంధించి చోటు చేసుకున్న నేరాలు టాప్ లో నిలిచిన రాష్ట్రాల జాబితాను ప్రకటించింది.రైతుల ఆత్మహత్యలు, సైబర్ నేరాలు,మహిళలపై వేధింపులు లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దీని మీద ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ “జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాలన దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో మీరు ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారు.ఆర్థిక నేరాలలో ఆరితేరి 32 సీబీఐ ఈడీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీ మూడేళ్ల పాలనలో ఆర్థిక నేరాల కేసులు 9273కి పెంచడం మీ ప్రతిభకి నిదర్శనం” అని విమర్శించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పర్యావరణ అతిక్రమణలు మరియు అన్యాయంగా దేశ ద్రోహం కేసులు విధించడం మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని టీడీపీ విమర్శిస్తుంది. ప్రతి ఎనిమిది గంటలకు మానభంగాలు రోజుకు రెండు నుంచి మూడు హత్యలు జరుగుతున్నాయని,ఎస్సీలు ఎస్టీలపైనా నేరాలు బాగా పెరిగాయని ఒక ఆంగ్ల దిన పత్రికను జత చేసి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్, జగన్ పరిపాలన మీద తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాలన దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో మీరు ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారు.(1/5) pic.twitter.com/bNhlzALB25
— Lokesh Nara (@naralokesh) September 1, 2022






