ఏపీలో రాజకీయాలు నెమ్మదిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోతున్నాయి. పార్టీలను బలోపేతం చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు, పార్టీని పటిష్పరిచేందుకు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి.ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి.
తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు కూడా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన రహస్యంగా పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే రాజోలులో ఇప్పటికే జనసేన తరపున టిక్కెట్ కోసం మాజీ ఐఏఎస్ ఒకరికి పవన్ హామీ ఇచ్చినట్లుగా తెలియ వచ్చింది. ఆయన నియోజవకర్గంలో పని చేసుకుంటూ పోతున్నారు. బొంతు రాజశ్వేరరావు రాజోలు కాకపోతే మరో చోటైన పోటీ చేయడానికి అవకాశం ఇస్తే జనసేలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.గుడివాడలో కొడాలి నాని ముఖ్య అనుచరులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు. వారు కొడాలి నానిపై పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. వారు సొంత రాజకీయం చేస్తున్నారు.సోమవారం పార్వతీపురం, పెదకూరపాడు నుంచి కొంత మంది నేతలు వచ్చి చేరారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో రోజూ ఇలాంటి చేరికలు ఉన్నాయి.
జనసేనలోకి పలువురి నాయకులు చేరిక
* పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు. pic.twitter.com/VZIgwnSMI9
— JanaSena Party (@JanaSenaParty) September 12, 2022