ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆ బిల్లు ఆమోదం పొందిన తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థలకు పెట్టిన పేర్లను మార్చి ఏం సాధిస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయా సంస్థల పేర్ల మార్పిడితో వివాదాలను సృష్టించాలని జగన్ ప్రభుత్వం చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ స్పందించారు.
పేరు మార్చి సాధించేది ఏమిటి?
* వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/IgmExcASLP
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2022
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆశించిన మేర వసతులు లేవని అన్నారు. కరోనా సమయంలో కేవలం మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్‌ను వేధింపులకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారని పవన్ ఆరోపించారు.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడికి గల కారణాన్ని వైసీపీ ప్రభుత్వం వెల్లడించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు వస్తే వర్సిటీలో వసతులు మెరుగు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.






