ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఇందులో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పోస్ట్‌తో దుమారం మరింత రేగింది. బాలయ్య బాబు కాస్త ఘాటుగా స్పందించడంతో మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్ వెన్నుపోటుపై టాపిక్ మళ్ళింది. బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు గతంలో ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని కొందరు పోస్టర్ల రూపంలో వైరల్ చేస్తున్నారు.
వెన్నుపోటు ఎపిసోడ్‌పై టార్గెట్ చేయడంతో టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పాత వీడియోలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వెన్నుపోటు విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు.
‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే’అంటూ లోకేష్ ఘాటుగా స్పందించారు.
పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే. pic.twitter.com/NE3B4Qc7OO
— Lokesh Nara (@naralokesh) September 26, 2022






