దేశ రాజకీయాలను కుదుపుతున్న లిక్కర్ స్కాం నెమ్మదిగా దేశ రాజధాని నుండి దక్షిణం వైపుకు మళ్ళుతుంది. మొదట తెలంగాణ ను తాకిన లిక్కర్ స్కాం తుఫాన్ ఇప్పుడు ఆంధ్రా రాజకీయ తీరం వైపు వస్తున్నట్లు కనపడుతుంది.ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే సీఎం జగన్, ఆయన భార్య భారతి తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని ప్రచారం చేస్తుంది. సాక్షాత్తు సీఎం జగన్ దేని మీద మంత్రులకు క్లాస్ కూడా తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెరాస అధినేత కూతురు కవితపై బీజేపీ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారుతోంది. ఈడీ సోదాల తర్వాత ఈ స్కాంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అరబిందోనే. “అరబిందో ఫార్మా లిక్కర్ కార్టెల్” హ్యాష్ ట్యాగ్‌తో బీజేపీతో పాటు ఇతరులు పెద్ద ఎత్తున ఈ స్కాం గురించిన వివరాలు బయట పెడుతున్నారు. బినామీ కంపెనీల పేరుతో అరబిందో ఫార్మా ఉత్పత్తి చేయడం హోల్ సేల్‌గా అమ్మడం, రీటైల్‌గా అమ్మడం అన్నీ చేసిందని వివరాలు సాక్షాల తో సహా బయట పెడుతున్నారు.
అరబిందో ఫార్మా కంపెనీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. ఇది ఇప్పటి వరకూ మద్యం వ్యాపారంలో ఉందని ఎవరికీ తెలియదు. ఔషధాలు మాత్రమే తయారు చేస్తుందని అనుకున్నారు. కానీ మద్యం తయారీ హోల్ సేల్, అమ్మకాల రంగంలోకి కూడా అడుగుపెట్టిందని ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత స్పష్టత వచ్చింది. ఈ కేసులో ముందు ముందు జరగబోయే పరిణామాలు అరబిందో చుట్టే తిరగబోతున్నాయన్న ప్రచారం ఢిల్లీలో గట్టిగా జరుగుతోంది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కేసులో ఉన్నది విజయసాయిరెడ్డి అల్లుడేనని నేరుగా చెప్పేశారు. టీడీపీ నేతలు అసలు లిక్కర్ స్కాం సూత్రధారి వైఎస్ భారతి అని ఆరోపిస్తున్నారు. చూడబోతే రాబోయే రాజకీయాలు మొత్తం ముఖ్యంగా లిక్కర్ స్కాం తూఫాన్ ఆంధ్రా తీరాన్ని తాకి అధికార పార్టీని ముంచబోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.