తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వినాయక చవితి అందరూ కలిసి మెలిసి చేసుకొని పండుగ. తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక. ఆధ్యాత్మికత, ఆనందాయకమైన ఈ పండుగ ఒకనాడు తెల్లవారిపై పోరాటానికి, భారతీయుల సమైక్యతకు ఆలంబనగా నిలిచింది. కాగా, ఈ పండుగలో మట్టి గణపతిని పూజించాలని కోరుతున్నాను. దీనివల్ల సంప్రదాయాలను పాటించిన వారిమి కావడమే కాకుండా పర్యవరణానికి మేలు చేసిన వారమూ అవుతాము. పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నాధిపతిని మనసారా ప్రార్థిస్తున్నాను.” అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలను తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ లో పంచుకోవడం విశేషం.
వినాయక చవితి శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan #GaneshChaturthi#VinayakaChavithi pic.twitter.com/Z8aRqhWAWW
— JanaSena Party (@JanaSenaParty) August 30, 2022