యేటా జాబ్ క్యాలెండర్,అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ అంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ ప్రకటనలు, అధికారం వచ్చాకా ఆ ఉసే లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై జగన్ చేసిన ప్రకటనలు యువత, నిరుగ్యోగుల్లో ఆశలు పెంచాయి. కానీ ఆ హామీల అమలులో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం నిరుద్యోగులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది.
అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ దాని నియామక బాధ్యతలను ఏపీపీఎస్సీకి కాకుండా పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు.నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగాన్నీ ఏపీపీఎస్సీ నుంచి భర్తీ చేయాల్సి ఉన్నా అలా చేయలేదు. ఎన్నికల తర్వాత ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్-1, గ్రూప్-2 సహా మిగతా శాఖల్లో భర్తీ కోసం భారీగా ఉద్యోగ నియామక ప్రకటనలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. 2019 మే నెలలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 2020లోనూ అదే పరిస్థితి. దాదాపు రెండున్నరేళ్లపాటు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు.
ప్రతి యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిర్ణీత తేదీల ప్రకారం నియామకాలు పూర్తిచేస్తామని 2019 సెప్టెంబర్‌లో సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసి అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ ఏడాది జనవరిలో కొలువుల ప్రకటన ఉంటుందని ఆశించిన లక్షలాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.
కాలక్షేప మాటలే తప్ప నోటిఫికేషన్ల విడుదల ధ్యాసే లేదు నిరుద్యోగుల ఆందోళనలతో రెండున్నరేళ్ల తర్వాత ఏట్టకేలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా వాటిలో గ్రూప్-1 పోస్టుల ప్రస్తావనే లేదు. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 32 పోస్టులతో గ్రూప్-2 ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2021 అక్టోబర్‌లో కేవలం 21 పోస్టులతో ఏపీపీఎస్సీ ద్వారా తొలి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా జగన్ సర్కార్ నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసింది.