జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి సామాన్యంగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసేవారు.ఆ తర్వాత నెమ్మదిగా జనంలోకి వెళ్లడం ప్రారంభించారు.ఇప్పటి వరకు కూడా అలాంటి సభల్లోనే జగన్ పాల్గొంటూ, దుష్టచతుష్టయం అంటూ ప్రత్యర్థులు మీద, అధికార పార్టీ వ్యతిరేక మీడియా మీద జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు సంబంధం లేని బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.ప్రకాశం జిల్లా చీమకుర్తికి జగన్ వెళ్లనున్నారు. చీమకుర్తిలో బూచేపల్లి కల్యాణ మండపం వద్ద మాజీ సీఎం వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు.సంక్షేమ పథకాలకు సంబంధం లేని సభ కావడంతో అనేక రాజకీయ అంశాలు, విమర్శలు ఉండే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పదేపదే జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనడం, అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కలకలం తదితర అంశాలపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారా? అనే చర్చ జరుగుతోంది.తనను అధికారం నుండి దించడమే లక్ష్యంగా పవన్ హెచ్చరించడంపై జగన్ ఎలాంటి విమర్శలు చేయబోతున్నారో చూడాలి.