రాజధాని అమరావతి సాధనకు కంకణం కట్టుకున్న అమరావతి రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తు వస్తుంది. ముఖ్యంగా అమరావతి రైతుల మహా పాదయాత్ర కి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. చివరకు రైతులు కోర్టు గుమ్మం తొక్కగా వారికి న్యాయం చేకూరింది.అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెంటనే మరోసారి పోలీసులకు పాదయాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి అనుమతి ఇవ్వాలని పోలీసుల ను ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్ర ముగింపు రోజున బహిరంగ సభకు ఇప్పుడే ధరఖాస్తు చేసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరఖాస్తును పరిశీలించాలని కూడా హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
పాదయాత్రలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించింది.అమరావతి రాజధానికి మద్దతుగా ఈ నెల12న రైతులు అమరావతి టు అరసవిల్లికి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది. రాష్ట్రాల మీదుగా సాగే జోడో యాత్ర.. ఢిల్లీలో నిరసనలకు అనుమతులు ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. అక్కడ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తున్నారన్నారు. ముఫ్పై ఐదు వేల మంది రైతుల్లో ఆరు వందల మంది పాదయాత్ర చేస్తామంటే భద్రత కల్పించలేమని చెప్పడమేమిటని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.