ఒకప్పుడు మనోడు వస్తేనే గ్రౌండ్ దద్ధరిల్లేది. ఎంత టార్గెట్ ఉన్నా సరే.. మనోడు బ్యాటింగ్ కు దిగితే ఓకె కొట్టేస్తాం అనే కాన్ఫిడెన్స్ వచ్చేసేది. అలాంటివాడు వెనకబడ్డాడు. తడబడ్డాడు. ఇంకేముంది అయిపోయింది మనోడి పని అన్నారు. ఇక అంతేలే అని అందరూ నిట్టూర్చారు. కాని అనుకోకుండా కొత్త ఐపీఎల్ టీమ్ కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది.. అస్సలు ఆలోచించకుండా ఓకె చెప్పాడు. కప్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ అదరగొట్టేస్తున్నాడు. పడి లేచిన కెరటంలా మనోడు విరుచుకుపడుతుంటే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోతున్నారు.
టీమిండియాలో ఆల్ రౌండర్ గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ఇంటర్నేషనల్‌లో మరో వండర్ ఫుల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ టీ 20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుని.. తన మార్కు చూపించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ 20లో, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసిన వెంటనే, హార్దిక్ తన T 20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత్ తరపున ఆరో బౌలర్‌గా హార్దిక్ రికార్డ్ కొట్టాడు. హార్దిక్ కంటే ముందు, ఇండియన్ టీమ్ నుంచి T20 ఇంటర్నేషనల్‌లో యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ ఫీట్ చేశారు. హార్దిక్ తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసి, 806 పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. టీ20ల్లో భారత్ తరపున 50 వికెట్లు, 500కు పైగా పరుగులు చేసిన ఏకైక భారతీయుడుగా.. వరల్డ్ లో 9వ క్రికెటర్ గా హార్దిక్ నిలిచాడు. హార్దిక్ కంటే ముందు షకీబ్ అల్ హసన్, షాహిద్ అఫ్రిది, డ్వేన్ బ్రావో, జార్జ్ డాక్రెల్, మహ్మద్ నబీ, మహ్మద్ హఫీజ్, కెవిన్ ఓబ్రెయిన్ , తిసారా పెరీరా అద్భుతమైన డబుల్ బ్లాస్ట్ చేసిన లిస్టులో ఉన్నారు.
నిజానికి టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడలేదు. బౌలింగ్ చేయడంలో ప్రాబ్లెమ్ ఫేస్ చేయడం, ఫిటెనెస్ లేకపోవడం, బ్యాటింగ్ లోనూ పెద్దగా స్కోర్లు చేయకపోవడంతో పాండ్య జట్టుకు దూరమైయ్యాడు. అంతెందుకు ముంబై కూడా అతన్ని వదులుకుంది. దీంతో ఇక పాండ్యా పని అయిపోయింది అంటూ చాలామంది ఘాటు కామెంట్లూ చేశారు. పాండ్య మాత్రం బైటపడలేదు. ఫ్యామిలీతో గడిపాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు ప్రతి మ్యాచ్ లో వేయగలిగినంత ఫిట్‌నెస్ సాధించాడు. అదే టైమ్ లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఎప్రోచ్ అయితే, ఆ చాన్స్ ను అస్సలు మిస్ చేసుకోని హార్దిక్ ..వస్తే కెప్టెన్ గానే ఆడతానని తేల్చిచెప్పాడు. ఇది హార్దిక్ కెరీర్ ను టర్న్ తిప్పిన డెసిషన్ గా చెబుతారు ఎక్స్ పర్ట్స్. అలా కెప్టెన్ గా ఐదారు మ్యాచ్ ల్లో కాస్త టెంపర్ ను చూపించినా… ఆ తర్వాత సర్దుకున్న హార్దిక్.. కూల్ గా కప్ ను కొట్టేశాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ గొప్పగా రాణించాడు. దెబ్బకు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 లో ఎవరూ ఎక్స్ పెక్ట్ కూడా చేయనంత లక్ కలిగిన ఏకైక ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా పేరే చెబుతారు.