చెత్త పన్ను.. ఇప్పుడు జనానికి కోపం కాదు.. చిరాకు పుట్టించే పన్ను ఇది. అవును చెత్త కలెక్షన్ కోసం మున్సిపాలిటీ, పంచాయతీల ద్వారా ఏపీ ప్రభుత్వం పన్ను సేకరిస్తోంది. 30, 50, 120ల కింద మూడు స్లాభ్ ల్లో ఏరియాను బట్టి వసూలు చేస్తున్నారు. గడపగడపకు కార్యక్రమంలో అయితే మెజారిటీ ఏరియాల్లో జనం ఈ పన్ను ఎత్తేయమని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు సైతం ఈ పన్ను ఎత్తేయడమే బెటరని ఫీలయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని అయితే సీఎంను అడుగుతామని కూడా హామీ ఇచ్చారు. అలాంటి చెత్త పన్ను ద్వారా వచ్చేది ఎంత అయినా గాని.. ఏపీ ప్రభుత్వం దాని మీద ఆదారపడటం ఏమీ బాగోలేదని అధికారులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. ఆల్రెడీ ఇలాంటి సర్వీసుల కోసమే మున్సిపాలిటీ గాని, పంచాయతీ గాని ప్రతి ఏడాది పన్ను వసూలు చేస్తారు. మెయిన్ టెయినెన్స్ కోసం ఆ పన్ను వేసింది, విధించింది. ఇప్పుడు సెపరేటుగా చెత్త సేకరణకు పన్ను విధించడం ఏంటని జనం మండిపోతున్నారు. ఇదంతా స్వచ్ఛ భారత్ కోసం.. స్వచ్ఛత కోసం అంటూ ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. పైగా బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ లో భాగమే ఈ పన్ను అని కూడా ప్రచారం చేస్తోంది. దీంతో బిజెపి వాళ్లు కూడా ఫైరవుతున్నారు. కేంద్రం చెబితేనే వసూలు చేస్తున్నట్లయితే.. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఈ పన్ను వసూలు చేస్తున్నట్లు అని నిలదీస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ అంతా తనకు ఓట్లు తెచ్చిపెట్టే సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అయినా సరిపోవటం లేదు. అందుకే ఇలాంటి పన్నులు వేస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా సరే.. ఎంతైనా సరే.. డబ్బులు వస్తుంటే చాలు.. దాని మీద ఎవరూ ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా.. ఎవరు ఎంత గోల పెట్టినా సరే.. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోరని అధికారులే చెబుతున్నారు. ఈ చెత్త పన్నుపై ఎంత ఫీడ్ బ్యాక్ నెగెటివ్ గా వచ్చినా సరే.. జగన్ మాత్రం దానిని పక్కన పెట్టే ఆలోచన కూడా చేయడం లేదని వారంటున్నారు.
ఒక్కోసారి ప్రజల సెంటిమెంట్లను హర్ట్ చేసే విధంగా ఎంత చిన్న వ్యవహారమైనా సరే.. నడిస్తే మాత్రం.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఈ చెత్త పన్ను కూడా అలాంటిదే. వైసీపీ శ్రేణులు సైతం వ్యతిరేకిస్తున్న పన్ను ఇది. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం దాని ద్వారా ఎంత వస్తుందో ఆరా తీస్తున్నారు తప్ప.. తీసే ఆలోచన మాత్రం చేయడం లేదు. పైగా ఈ మధ్య మున్సిపల్ కార్మికులకు టార్గెట్లు ఇచ్చి మరీ వసూలు చేయమంటున్నారు. టార్గెట్ ప్రకారం వసూళ్లు కాకపోతే వారికి జీతాలు కూడా వేయమని నోటిఫికేషన్లు కూడా ఇఛ్చారు. దీనిపై మున్సిపల్ కార్మికుల యూనియన్లు ఫైరయ్యారు. వారంతా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి నో రెస్పాన్స్.