ప్రస్తుత జాతీయ రాజకీయాలలో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఈ మాట చెప్పడానికి ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదు. గత మూడు దశాబ్దాలకు పైగా చురుకుగా అగ్రశ్రేణి నాయకునిగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. పార్టీనీ స్థాపించిన ఎన్టీయార్ కంటే కూడా సీఎం గానూ టీడీపీ అధ్యక్షునీ గానూ రెట్టింపు కాలం పనిచేసి టీడీపీ అంటే నాది అనేంతలా కష్టపడ్డారు చంద్రబాబు.
రాబోయే ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి. ఆ విషయం టీడీపీ కంటే కూడా ఎవరికీ ఎక్కువగా తెలియదు.2019 ఎన్నికల ముందు బీజేపీని ధర్మ పోరాటం పేరిట ఇరుకున పెట్టినా,జగన్ నీ కూడా కలిపి ఇరికించాలని చూసిన బాబు మార్క్ వ్యూహం బెడిసికొట్టింది. ఈసారి ఆయన పద్దతి మార్చారు. బీజేపీనీ మచ్చిక చేసుకుంటున్నారు.జగనే తనకు ఎప్పటికీ ప్రత్యర్ధి అని తెలుసుకున్నారు. అందుకే తన విమర్శల బాణాలు అన్ని జగన్ మీదే ఎక్కుపెట్టారు.
రాబోయే ఎన్నికలు కోసం ఏపీని మొత్తం చుట్టేయాలని బాబు ప్లాన్. దానికి తగినట్లుగా రాష్ట్రం అంతా టూర్లు వేసేందుకు ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు అని సమాచారం. దాంతో పాటు ఆయా ప్రాంతాలకు నందమూరి,నారా ఫ్యామిలీ తరఫున కూడా పెద్దలను రెడీ చేసి ఉంచారు. అంటే ఏపీలో అన్నీ ప్రాంతాలను బాబు ఫ్యామిలీ పంచుకుంటోంది అన్నమాట.గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలలో చంద్రబాబు,బావమరిది ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ చేరో వైపు నుండి కవర్ చేస్తారు. రాయలసీమలో బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను నారా లోకేష్ చూసుకుంటారు.ఈ రెండు జిల్లాలలో టీడీపీ సామాజికవర్గం బలం ఉంది.పైగా ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పుట్టినగడ్డగా కోస్తా నడిబొడ్డు ఉంటుంది.ఆరు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రా పార్టీ బాధ్యతలు ఆ బరువు అంతా మాజీ ఎంపీ గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు ప్రస్తుత గీతం విద్యా సంస్థల చైర్మన్ అయిన శ్రీ భరత్ చూసుకుంటారు అని అంటున్నారు.ఈ విధంగా రాష్ట్రం మొత్తం టీడీపీ తరుపున నందమూరి, నారా కుటుంబాలు కవర్ చేసి చావో రేవో లాంటి 2024 ఎన్నికలకు వెళ్తారు. ఈ వ్యూహానికి టీడీపీ కార్యకర్తలు వైపు నుండి కూడా పూర్తి మద్దతు ఉంటుంది
