జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ ముఖ్య నేత అమిత్ షా కలిసి వెళ్లిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సంచనలం అయ్యింది. కలిసి చాలా కాలం అవుతున్న ఆ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల బ్రహ్మాస్త్రా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న కారణంగా ఆ ఫంక్షన్ నీ తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది అని వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడు పవన్ మిత్రుడు గా వుండగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ జూనియర్ సేవలు పూర్తిగా వాడుకుంటం అంటుంది.
బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం గురించి వివరిస్తూ అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ మధ్య సమావేశం పైన ఆయన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పారు. భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంటామంటూ సంచలనానికి తెర లేపారు.జూనియర్ ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో – ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని ప్రశ్నించగా.. ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామంటూ సోము స్పష్టం చేసారు.






