రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ ఎవరు ఎన్ని అనుకున్న తను అనుకున్న పనులు చేస్తాను, చేసి చూపిస్తాను అని అంటుంది. అనేక నిర్ణయాలు వివాదం అయినా ప్రజలు వ్యతిరేకించిన ముందుకు వెళ్తుంది తప్పించి వదిలి పెట్టడం లేదు. ఉదాహరణకి చెత్త మీద పన్ను దీని మీద ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అయినా వైసీపీ ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. చివరకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు స్థానిక ఎమ్మెల్యే లను, నాయకులను గట్టిగానే వ్యతిరేకించారు అయినా ఎక్కడా తగ్గలేదు. అలాగే ఏకైక అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానులు అంది, రాజధాని ప్రాంతం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా, కోర్టులో కేసులు పడి నిలిపివేయలంటూ ఆర్డర్స్ వచ్చినా, మళ్ళీ మళ్ళీ మూడు రాజధానులు అంటూనే ఉంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.వైకాపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికి పైగా పూర్తి చేశామని, ఇంకా సమయం ఉన్నందున మిగిలిన వాటినీ అమలు చేస్తామన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గసమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బల్క్‌డ్రగ్స్ పార్క్ రాష్ట్రానికి వస్తుంటే తెదేపా నేతలు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫార్మా రంగానికి రాష్ట్రం హబ్‌గా మారబోతోందని, ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. అమర్‌రాజా సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై పీసీబీ విచారణ జరిపి నిర్ధారిస్తే తెదేపా నేతలు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు, యనమల రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్నారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి తెదేపా నేతలు లేఖలు రాశారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను జైలుకు పంపాలని పేర్కొన్నారు. వరద ప్రాంతాల పర్యటన సమయంలో సీఎంతో ముచ్చటించిన బాలిక మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు.






