అభివృద్ది వికేంద్రీకరణ, మూడు రాజధానుల మీద చర్చ సందర్భంగా సీఎం జగన్ గత ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేశారు.చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.5,674కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు సీఎం జగన్. మరో రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టి తమను కట్టమని వదిలేశారని.. అంతగా భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్ చూపించి మోసం చేసినందుకు నిజానికి 420 కేసు పెట్టాలి అన్నారు. ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టారని ప్రశ్నించారు. వాస్తవం ఏమిటంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్థితి అన్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని.. రాష్ట్రంలో 80 శాతం పైచిలుకు ప్రజలు తెల్లకేషన్ కార్డు మీదే బతుకుతున్న పరిస్థితి ఉందన్నారు ముఖ్యమంత్రి.
దీని మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. పాలన వికేంద్రీకరణకు జగన్ కొత్త అర్దం చెప్పారు అన్నారు. ఉల్లిపాయలు, పామాయిల్, కందిపప్పు పంచి అదే అభివృద్ది అనుకుంటున్నారు. వికేంద్రీకరణకు సీఎం జగన్ ఇచ్చిన వివరణ మీద వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మీ వివరణకు వాహ్ అంటూ సెటైర్లు పేల్చారు.
ముఖ్యమంత్రి విజన్ స్థాయి ఏంటో కూడా చెప్పారు. ఒక విడియో ను కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటో తెలుసా… బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ పంచగలగడం!! వాహ్ ముఖ్యమంత్రి గారూ…వాహ్.. మీ వివరణకు…. విజ్ఞతకు… విజన్ కు ఓ పెద్ద నమస్కారం! pic.twitter.com/tPvGGZSQIY
— Lokesh Nara (@naralokesh) September 16, 2022