పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల పై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించిన అధికారులు, వాటికి సంబంధించిన వివరాలను సీఎంకు అందించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని, వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు.
టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం సమీక్షించారు. 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని.. ఈ ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ వేయించి ఇవ్వాలని నిర్ణయించారు. తరగతి గదులను డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపైనా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు
స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలి. ఈ నంబర్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి’’ అని సీఎం న్నారు. 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకున్నామని అధికారులు అన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని సీఎం ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలని సీఎం ఆదేశించారు.