ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” పథకాలను అక్టోబర్ 1 నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకాల అమలుకు సంబంధించిన వైబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. వెబ్ సైట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల దరఖాస్తు చేసుకునే వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. వివాహ తేదీకి వధువు వయసు 18, వరుడి వయసు 21 కచ్చితంగా నిండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. చదువును ప్రోత్సహించేందుకే పదో తరగతి పాస్ నిబంధన అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలోని మరో కీలక హామీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబరు 1 నుంచి వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం జారీ చేసింది. తాజాగా ఈ పథకాల వెబ్ సైట్లను సీఎం జగన్ ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతోందని వెల్లడించింది. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం. పిల్లలు కచ్చితంగా చదువుకునేందుకు, బాల్య వివాహాలు నిరోధించేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్న ముఖ్యమంత్రి. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పంపిణీచేస్తామన్న సీఎం. 1/2 pic.twitter.com/NICt2suqDK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 30, 2022