“వైద్యో నారాయణో హరిః” అన్నారు మన పూర్వీకులు, వైద్యుని ప్రత్యక్ష దైవం అన్నది మన సంస్కృతి. కులం, మతం,ప్రాంతం,మిత్రుడు, శత్రువు అని చూడకుండా అనారోగ్యం తో ఉన్నవారికి సేవలు చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు. మొన్న బెంగళూర్ లో 3 కిలోమీటర్లు పరుగున వెళ్లి పేషెంట్ నీ ఒక డాక్టర్ కాపాడడం చూశాం.
తాజాగా సికింద్రాబాద్ – విశాఖ దురంతో ట్రైన్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని పురుడు పోసి అందరి మన్ననలు పొందింది.శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అదే భోగీ లో ప్రయాణిస్తున్న వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని ట్రైన్ లో డెలివరీ చేసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.తల్లి,బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందంగా ఉందని,ఈ ప్రయాణంలో తమ తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని అందరూ అభినందించారు.
ఈ విషయమై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డిని అభినందించారు.చదివిన చదువు సమాజానికి ఉపయోగ పడినప్పుడు ఆ చదువుకు సార్ధకత వస్తుంది. ఆపద లో ఉన్న గర్భిణికి కాన్పు చేసి తల్లిని, బిడ్డను కాపాడిన వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డి కి అభినందనలు అని పేపర్ కటింగ్ తో సహా ట్వీట్ చేశారు.
చదివిన చదువు సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆ చదువుకు సార్థకత అని నిరూపించిన స్వాతిరెడ్డి నేటి యువతకు ఆదర్శం. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళుతున్న దురంతో ఎక్స్ప్రెస్లో గర్భిణికి కాన్పు చేసి, తల్లీబిడ్డను కాపాడిన వైద్య విద్యార్థిని స్వాతిరెడ్డికి అభినందనలు! pic.twitter.com/lhjVsRBSVO
— N Chandrababu Naidu (@ncbn) September 14, 2022