ప్రముఖ సినీ నటులు బీజేపీ నేత కృష్ణంరాజు మరణంపై సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సినీ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న విషయంపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కృష్ణంరాజు మరణంపై స్పందించారు. ‘‘కేంద్ర మాజీ మంత్రి, నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ట్వీట్ చేశారు.
శ్రీ కృష్ణంరాజు గారు నాకు అత్యంత ఆత్మీయులు. శ్రీ వాజ్ పేయి గారి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించే వారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరం. pic.twitter.com/reBSeZ95ST
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 11, 2022
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సానుభూతి తెలిపారు మరియు ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు.(1/2) pic.twitter.com/e9nBVU3Zye
— N Chandrababu Naidu (@ncbn) September 11, 2022
సినిమాల్లో, రాజకీయాల్లో కృష్ణంరాజు గారు చేసిన సేవలు, సాధించిన ఘనతను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు ప్రగాఢ సానుభూతి తెలిపారు టీడీపీ యువనేత నారా లోకేష్
సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.(1/2) pic.twitter.com/ihp7pZogeu
— Lokesh Nara (@naralokesh) September 11, 2022






