రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిందూపురం ఎంపీ గోరంట్ల న్యూడ్ విడియో మనటలు నెల రోజుల తరువాత మళ్ళీ అంటుకున్నాయి. గోరంట్ల మాధవ్ తనపై కుట్ర చేశారని సీఐడీకి ఫిర్యాదు చేశారు. తనమీద ఫేక్ వీడియోను చేసి పరువు తీశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు . ఎంపీ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు వెంటనే కేసు నమోదు చేశారు. అయితే వీడియో వివాదం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో చాలా ఆలస్యంగా సుమారు నెల రోజుల తరువాత గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయడం,వెంటనే సీఐడీ కేసు నమోదు చేయడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కేసు నమోదు కాక ముందే ఏపీసీఐడీ ఈ అంశంపై టీడీపీ నేతలు విడుదల చేసిన అమెరికా సంస్థ ఫోరెన్సిక్ రిపోర్టుపై విచారణ జరిపింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఫేక్ అని ప్రకటించారు. కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
గోరంట్ల మాధవ్ వేధించారని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అది నైతిక పరమైన అంశమేనని అందులో వివాదమేదీ లేదని భావించారు. అయితే అనూహ్యంగా దాదాపుగా నెల రోజుల తర్వాత తన వీడియోను మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవే స్వయంగా సీఐడీకి ఫిర్యాదు చేయడం వెంటనే కేసు నమోదు కావడంతో ఈ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు.






