భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నేడు,మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ శ్రేణులు అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తోంది. మరియు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్ని నెలరోజుల పాటూ నిర్వహించబోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Warm birthday greetings and best wishes to Honourable PM Sri @narendramodi ji. May God bless him with good health and long life.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2022
ప్రధాని నరేంద్ర మోడకి భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం ‘మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
प्रधानमंत्री नरेन्द्र मोदी जी को जन्मदिवस की हार्दिक बधाई व शुभकामनाएं। मेरी कामना है कि आप के द्वारा अतुलनीय परिश्रम, कर्तव्यनिष्ठा और सृजनशीलता के साथ किया जा रहा राष्ट्रनिर्माण का अभियान, आप के नेतृत्व में आगे बढ़ता रहे। मेरी शुभेच्छा है कि ईश्वर आपको स्वस्थ और दीर्घायु बनाए।
— President of India (@rashtrapatibhvn) September 17, 2022
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని,దేశ ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని గతంలో కలిసిన ఫోటోను కూడా చంద్రబాబు ట్వీట్ ద్వారా పంచుకున్నారు.
I extend my heartfelt greetings to Prime Minister Sri @narendramodi Ji on his birthday today. May God bless him with many more years of good health and energy to tirelessly strive for welfare of people and all-round development of nation.@PMOIndia pic.twitter.com/4I2P4e9QHy
— N Chandrababu Naidu (@ncbn) September 17, 2022