రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు అభివృద్ది గురించి మాట్లాడకుండా ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం ఏకపక్షంగా మాటల దాడులు చేస్తూ ఉంటారు. ఈ మధ్య అధికార పత్రికలోనూ, నాయకులు కూడా అభివృద్ది పూర్తి చేసేశాం అన్న అర్దం వచ్చే దోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోనీ కేంద్రం ప్రకటించిన వివిధ ప్రాజెక్టులకు సరైన సమయంలో నిధులు విడుదల చేసి వాటిని సద్వినియోగం చేసుకున్నారా? అంటే అది లేదని చెప్పాలి.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభలో లేవనెత్తిన విషయం భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌లో రాష్ట్ర వాటా నిధుల అంశానికి ,నేడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కొవ్వూరు రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. రాష్టంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటాగా రూ.3,502 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం రూ.459 కోట్లు మాత్రమే విడుదల చేశారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే స్పష్టం చేశారు.