ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పరమైన విధానాలు అతి ప్రమాద కరంగా ఉన్నాయని ఆర్ధిక నిపుణులు ఎప్పటికప్పుడు వారిస్తున్నరు.కానీ ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం మిగతా రాష్ట్రాల కంటే మన ఆర్థిక పరిస్థితిని బాగుందని బుకాయిస్తు వస్తున్నారు. ప్రభుత్వ మాత్రం అందిన కాడికి అప్పులు చేసుకుంటూ పోతుంది.
ఇప్పుడు కొత్తగా రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను వేలం వేసి, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాన్ని తీసుకుంది. 7.58 శాతం వడ్డీకి ఈ వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 25 వేల కోట్లకు చేరువైంది. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం కేంద్ర అనుమతించిన పరిమితి రూ. 28 వేల కోట్ల రూపాయలుగా ఉంది.