పల్లెల అబివృద్దికి భారత ప్రభుత్వం తేసుకొనివచ్చిన పంచాయితీ రాజ్ వ్యవస్థ పల్లెల లో అనేక మార్పులకు కారణం అయ్యింది. పల్లెల ప్రగతికి సర్పంచులు కృషి చేస్తూ, వారికి కావాల్సిన అవసరాలు వారే తీర్చుకుంటూ అభివృద్ది వైపు భారత పల్లెలు సాగుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాలను వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెల్చుకున్నారు.
అయితే ఇప్పుడు వారంతా నిధులు లేక విలవిల లాడుతున్నారని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో 729 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.130 కోట్ల నిధులు మంజూరు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తంలో ఇప్పటికే రూ.70 కోట్లను వెనక్కి తీసేసుకుందని వార్తలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉంది. ఆ సమయంలో నిధుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించిందని చెబుతున్నారు. ఆ తర్వాత 14వ ఆర్థికసంఘం నిధులను రాత్రి రాత్రికే ప్రభుత్వం నవరత్న పథకాల కోసం మళ్ళించింది అని వార్తలు వచ్చాయి.
సర్పంచ్లు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిధుల లేమితో చివరకు విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. అంతేకాకుండా చెత్త బండి వారికి వేతనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామ సర్పంచ్ స్వయంగా చెత్త బండిని లాగుతూ ఇంటింటికీ తిరిగాల్సి వచ్చింది.పంచాయతీ సర్పంచ్లుగా ఎన్నికైనవారు తమ గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితిలో ఉన్నారని, కొన్ని చోట్ల సర్పంచ్లు తమ సొంత డబ్బులతో గ్రామాల్లో ముఖ్యమైన తాగునీరు విద్యుత్ డ్రైనేజీ రోడ్ల మరమ్మతులు వంటివి చేయిస్తున్నారు. ఒక్క ప్రకాశం,గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.