కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణస్వామి విజయవాడలో బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతినే రాజధానిగా అందరూ గుర్తించారని అందుకే మంగళగిరిలో ఎయిమ్స్ కేటాయించామని అలాగే, జాతీయ రహదారులను కూడా మంజూరు చేశామని చెప్పారు. వివాదాస్పద నిర్ణయాలతో ఎట్టిపరిస్థితుల్లోనూ అభివృద్ధి ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
అమరావతిలో అభివృద్ధి పనులు పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు అమరావతి అభివృద్ధి చెందాలనేదే కేంద్ర ప్రభుత్వ ఆలోచనన అని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ఒక రాజధాని పెడతారా,మూడు పెడతారో వైసీపీ సర్కారు ఇష్టమని కానీ అమరావతిని అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని నారాయణస్వామి పేర్కొన్నారు.
Had a meeting with district office bearers, mandal office bearers and morcha pramukhs at Nakshatra conventional hall Vijayawada parliament constituency NTR District. pic.twitter.com/s0EA9NrW7T
— A Narayanaswamy (@ANarayana_swamy) September 14, 2022
అనంతరం కేంద్ర మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే, జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు.