తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టిఆర్, బిజేపి కేంద్ర మంత్రి అమిత్ షా బేటీ విపరీతమైన ఆసక్తి ని తెసుకొని వచ్చింది. ఒక పక్క జూనియర్ మరియు అమిత్ షా లు ఇద్దరు కేవలం ఇటీవల విడుదల అయిన RRR లో తారక్ నటనను మెచ్చుకోవాడినికి ఏర్పాటు చేయబడిన సమావేశం ఇది అని చెప్తుంటే, మరో పక్క రాజకీయ పార్టీలు జూనియర్ కి బిజేపి గెలమ్ వేస్తుంది అని చెప్తున్నాయి. వీరి సమావేశం అనేక రాజకీయ సమీకరణాల కు తెర లేపింది అన్నది మాత్రం వాస్తవం.
ఇది ఇలా వుంటే జూనియర్ కి అత్యంత సన్నిహితుడు, జూనియర్ ప్రోద్భలంతో టిడిపి ఎమ్ఎల్ఏ అయ్యి తరువాత వైసీపి లో చేరి కీలక నాయకునిగా ఎదిగి మంత్రి అయి ప్రస్తుతం మాజీ మంత్రి అయిన గుడివాడ ఎమ్ఎల్ఏ కొడాలి నాని ఈ రోజు జూనియర్ ఎన్టిఆర్, బిజేపి కేంద్ర మంత్రి అమిత్ షా బేటీ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని తెలిపారు. జూనియర్ ఏమి కొత్తగా నటించడం లేదు కదా పాతిక పైగా సినిమాలలో నటించిన ఎన్టిఆర్ నటనను ఇప్పుడు వీరు కొత్తగా మెచ్చుకోవడం ఏంటి ? బీజేపీ ని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యారని అనుకుంటున్నాను అని అన్నారు. మోడి అమిత్ షా అనేక వ్యూహాల తో ముందుకు వెళ్తూ వుంటారు వాటిల్లో భాగంగానే ఈ భేటీ జరిగి వుంటుంది అని అన్నారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. ఇక ఎప్పటిలానే మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు ని విమర్శించారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకులు ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తెసుకొని రాబోతున్నాయి అని అంటున్నారు. బిజేపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ మరియు జూనియర్ ఎన్టిఆర్ లకు అపారమైన రాజకీయ చైతన్యం వుందని, జూనియర్ అమిత్ షా భేటీ రాజకీయ మార్పులకు కారణం కాబోతుంది అని 2024 లో బిజేపి, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. ఏది ఏమైనా జూనియర్, అమిత్ షా భేటీ అధికార పార్టీలో కొంత గుబులు రేపింది అని చెప్పాలి. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడానికే మీడియా ముందుకు వచ్చే కొడాలి నాని ప్రత్యేకంగా మాట్లాడడం,అధికార పార్టీ లో ఆందోళన ను తెలియపరిచింది.