గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు పాాల్పడిందని వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లైనా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ఏబీ వెంకటేశ్వరరావుేకు అనుకూలమైన తీర్పులు వచ్చాయి. ఐపీఎస్ ఆఫీసర్ ఏబి.వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ ను ఎత్తేసింది. ఏపీ సర్కార్, జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరింది.
నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సస్పెన్షన్ రెండేళ్లు ముగిసిపోయినందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండని సుప్రీంకోర్టు తెలిపింది. తన సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ ఏడాది ఏప్రిల్ 29న ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అందించారు ఏబీ వెంకటేశ్వరరావు. అయితే సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. దీంతో ఈ నెల 12న మరోసారి ఏపీ సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావును కలవకుండానే ఏపీ సీఎస్ సమీర్ శర్మ సెక్రటేరియట్ నుండి వెళ్లిపోయారు. దీంతో సీఎస్ ను కలవకుండానే ఏబీ వెంకటేశ్వరరావు సెక్రటేరియట్ నుండి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని తెలిపారు.