చేయని మంచి చేసినట్టు చెప్పుకుంటూ, అన్నం పెట్టే రైతుల్ని వంచిస్తున్న వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. అబద్ధాలకు, మోసాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే, ఎప్పుడూ అది జగన్ కే వస్తుందన్నారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు .
రాష్ట్రంలోని ప్రతి రైతు ఎంత రుణభారంతో ఉన్నాడో దేశవ్యాప్తంగా విడుదలైన గణాంకాలే చెబుతున్నాయి. రైతులు సహా, ప్రతి ఒక్కరినీ మోసగించడం అనేది జగన్మోహన్ రెడ్డికి అవినీతితో పెట్టిన విద్య. అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు, వైసీపీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకి ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పారు. అప్పటికి దేశంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అమల్లోకే రాలేదు. ఎప్పుడైతే కేంద్రం కిసాన్ యోజన పథకాన్ని ప్రకటించిందో, దాని తాలూకా ఇచ్చే రూ.6,500లు కలుపుకుని, రాష్ట్ర వాటాగా రూ.7,500లు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, మొత్తం రూ.12,500సొమ్ముని తానే ఇస్తున్నట్లు, ఐదేళ్లలో రూ.50వేలు ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన రూ.50వేలలో కేవలం రూ.30వేలు (రూ.7,500లెక్కన) మాత్రమేఇచ్చి, ప్రతిరైతుకి రూ.20వేలు ఎగ్గొట్టి ఈ ముఖ్యమంత్రి రైతుల్ని మోసగిస్తున్నది నిజం కాదా ? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 50లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. 50లక్షల మంది రైతులకు వాస్తవంగా వైసీపీ మేనిఫెస్టో ప్రకారం రూ.12,500కోట్లు చెల్లించాలి. రైతులకు ముఖ్యమంత్రిఇస్తానన్న సొమ్ము ఇవ్వకుండా, వారిని మోసగిస్తున్నది నిజం కాదా? సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 15లక్షల మంది రైతులుంటే, కేవలం లక్షా 50వేల మందికే రైతు భరోసా కింద రూ.7,500ఇస్తూ, వారి జీవితాలనే మార్చేస్తున్నటు ముఖ్యమంత్రి డబ్బాలు కొడుతున్నాడు. అలానే వ్యవసాయం చేస్తూ, భూమినేనమ్ముకొని బతుకుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మంది వరకు ఉంటే, రకరకాల ఆంక్షలతో ఆ సంఖ్యను ఏటేటా తగ్గిస్తూ, 40, 45లక్షలకు జగన్ రెడ్డి పరిమితం చేసింది నిజం కాదా ? పక్క రాష్ట్రంలో రైతుగా ఉన్న వ్యక్తిని ఈ ప్రభుత్వం ఎందుకు రైతుగా గుర్తించడం లేదు. దేశంలో ఎక్కడున్నా రైతురైతే..రైతుకి కులంమతం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం మాత్రమే రైతుల్ని కులాపేరుతో విభజించింది. ఈ విధంగా విభజించాలన్న జగన్ రెడ్డి ఆలోచనకు నిజంగా హ్యట్సాఫ్ చెప్పాల్సిందే.
రైతుభరోసా పేరుతో గతప్రభుత్వంలో రైతులకు అందిన అనేకపథకాలను ఈ ముఖ్యమంత్రి ఆపేసింది వాస్తవంకాదా ? పక్క రాష్టమైన తెలంగాణ రైతులమోటార్లకు మీటర్లు బిగించేదిలేదని తెగేసిచెప్పినాకూడా, రైతుబందునని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి దాసో హమై, రైతులమెడపై కత్తులుపెట్టి, బలవంతంగా మోటార్లకు మీటర్లు బిగిస్తున్నది నిజం కాదా ? జగన్ రెడ్డి అసలు మీటర్లు ఎందుకు పెడుతున్నాడో, విద్యుత్ రాయితీసొమ్ము రైతులు చెల్లించాక, వారికి తిరిగిచెల్లించడంఎందుకు? రైతులకు ఇవ్వాల్సింది. ఇచ్చేది నేరుగా వారికే ఇవ్వొచ్చుగా ! రైతులంతా మూకుమ్మడిగా మీటర్లు వద్దు బాబోయ్ అంటుంటే బలవంతంగా మీటర్లు బిగిస్తున్న ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ ఎత్తేసేఆలోచనలో పాలకులు ఉన్నట్లుగా అనిపిస్తోంది. చంద్రబాబు హాయాంలో రైతాంగానికి 9గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక అది 7గంటలై, రైతుకు అందేసరికి 5గంటలే అయ్యింది నిజం కాదా? రైతుకి నాణ్యమైన విద్యుత్ అందించడానికి గతంలో ఉన్నప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్ ని, సాధారణంగా వినియోగించే విద్యుత్ ని విభజించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
జగన్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగిస్తే విద్యుత్ ఆదా అవుతుందని చెప్పడం శుద్ధ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం రైతులకు అద్భుతాలు చేస్తోందని ఆయనే నేడు చెప్పుకొ చ్చాడు. మరి రైతులు పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక, కల్లాల్లోనే బస్తా రూ.1000లకు, రూ.1200 లకు ఎందుకు తెగనమ్ముకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చెబు తున్న రైతుభరోసాకేంద్రాలు రైతుల్ని బాదే కేంద్రాలుగా మారాయి. జొన్న, మొక్కజొన్న కొను గోళ్ల పేరుతో రైతు భరోసా కేంద్రాల్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలంతా లక్షాధికారులైతే, పండించిన రైతులేమో బికారులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది రైతుల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంత మంది లక్షాధికారులయ్యారో చెప్పాలి. మూడేళ్ల పాలనలో రైతు ల్ని నట్టేట ముంచిన జగన్ రెడ్డి దెబ్బకు రాష్ట్రంలోని రైతులు వ్యవసాయం చేయాలంటేనే వణికి పోతున్నారు. ఈ మూడేళ్లలో తన ప్రభుత్వం వ్యవసాయానికి లక్షా 50వేల కోట్లు ఖర్చుపెట్టిందని గణపవరం సభలో ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు. వైసీపీప్రభుత్వం ఈమూడేళ్లలో ఏటా రూ.10వేల కోట్ల చొప్పున వ్యవసాయ బడ్జెట్లో రూ.30వేల కోట్ల నిధులు కేటాయించింది. ఆ సొమ్ములో ఖర్చు చేసిందెంత అంటే దానికి లెక్కలేదు. ముఖ్యమంత్రేమో రూ.లక్షా 50వేల కోట్లు అంటున్నాడు.. ఆ సొమ్మంతా పాతాళంలో వ్యవసాయం చేసేవారికి ఖర్చుపెట్టారా ? వ్యవసాయానికి గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయా? లక్షలోపు రుణాలకు ఉచిత వడ్డీ అని ముఖ్యమంత్రి చెబుతున్నాడు. ఎక్కడైనా అమలవుతోం దా? ప్రభుత్వానికి చెందిన కేంద్ర సహాకార బ్యాంకులు ఊళ్లల్లో టముకు వేయించి మరీ, లక్షలోపు రుణం తీసుకున్న రైతుల నుంచి బలవంతంగా వడ్డీలు వసూలు చేస్తున్నది నిజం కాదా? అన్నారు.
టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాంతం హర్టీకల్చర్ హబ్ గా మారింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా ఉద్యాన పంటలు పండించే రైతులకు ఒక్కడ్రిప్ పైప్ గానీ, స్ప్రింక్లర్ గానీ ఇచ్చిందా? తైవాన్ పవర్ స్ప్రేయర్లు, రోటోవేటర్లు, కల్టివేషన్ పనిముట్లు, ఇతర యంత్ర పరికరాలు, రైతురథాలు (ట్రాక్టర్లు) అన్నీఎత్తేశారు.






