తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి కాళ్ళు అరిగెలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన కోట మల్లయ్య. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూసేందుకు గ్రామ,వార్డు సచివాలయాలను తీసుకు వచ్చామని చెబుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపై ఏం సమాధానం చెబుతారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కోట మల్లయ్యకు తాతల ఆస్తి 22 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 10 సెంట్లను ఇతరులు ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు ఇప్పించాలని 2018 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థలం పత్రాలను అధికారులకు ఇచ్చారు. పాపం పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.మరీ 4 యేళ్ళు అధికారుల చూట్టూ తిరుగుతున్న పట్టించుకోవట్లేదంటే..ఏమనాలి..అధికారుల నిర్లక్ష్యమా లేక పాలకుల వైఫల్యమా లేక అంతా మాయిష్టం అనుకునే నాయకత్వమా….
సర్వే చేయించి ఆక్రమణకు గురైన తన స్థలం గుర్తించి తనకు ఇప్పించాలని 2018, 2021లో చలానా కూడా కట్టానని….అయినా అధికారులు వచ్చి సక్రమంగా కొలతలు వేసి.. ఆక్రమిత స్థలాన్ని తనకు ఇప్పించలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల నుంచి భార్యా పిల్లలతో కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. చేనేత వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని..తనకు న్యాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్లోని అధికారులను కలిసి తమ బాధను చెప్పుకున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్యుల సమస్యలు ఎలా వున్నాయో తెలుసుకోవాలి……..ఇది ఈవిధంగా పని చేస్తున్నాయి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూన్నారు సామాన్య ప్రజలు.
