ఏపీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రైతుల పాదయాత్ర పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా కోడూరులో జరిగిన వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం జగన్ మూడు రాజధానులను కొనసాగించాలని చూస్తున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో గెలిచే పరిస్థితి లేదని తన పార్టీపై నమ్మకం లేక మిగతా పార్టీలతో కలిసి వెళ్లేందుకు ఆయన చూస్తున్నారని సెటైర్లు వేశారు. టీడీపీని కాపాడేందుకే జనసేన పార్టీని పెట్టారని అలాంటి వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని అడిగారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ఇలా ఎంత మంది కలిసి పోటీ చేసినా ఈసారీ జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రి అవడం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు . తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.
అన్నాను…అంటాను…
మళ్ళీ మళ్ళీ అంటాను…
అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర !— Ambati Rambabu (@AmbatiRambabu) September 27, 2022